
శ్రీ నగేరేశ్వరులకు వైదికంగా అన్నాభిషేకం విశేష పూజలు…
నవంబర్ 29: గుంటకల్లు
గుంతకల్లు పట్టణంలోని ప్రముఖ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో శుక్రవారం ఉప ఆలయమైన శ్రీ నగేరేశ్వర స్వామివారికి అన్నాభిషేకం తో విశేష పూజలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం శ్రీవారి మూలవరులకు విశేష పూజలతో వైదికంగా అన్నాభిషేకం నిర్వహించారు. సదర కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యన పాల్గొన్నారు.