
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు….
నవంబర్ 30 శ్రీకాళహస్తి
పవిత్ర మాసములలో ఒకటైన ఈశ్వరునకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రతీతి. కార్తీకమాసం శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలను దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో సాంప్రదాయ రీతిన జరిగాయి. సదరు పూజ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆలయ వేద పండితులు, అర్చక బృందం సంయుక్తంగా దేవాలయ ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశములు ఏర్పాటుతో విశేష పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు శ్రీవారికి ధూప,దీప నైవేద్యాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని కార్తీక మాసపు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమ బిల్వాలను కుంకుమను నిమజ్జల కార్యక్రమంను అత్యంత భక్తిశ్రద్ధల నడుమ సాంప్రదాయ పద్ధతిలో భక్తాదుల పట్ల నేత్రానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి
టి.బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కర్ణాకర్ గురుకుల్, ఏ.ఈ.ఓ లోకేష్ రెడ్డి,సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్, దేవస్థానం ఇన్స్పెక్టర్ హరి యాదవ్, మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.