
సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
నవంబర్ 30 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన సిఏం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందిరమ్మ కాలనీలో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కలియ దిరుగుతూ ప్రజలను పలకరించారు. అలాగే స్థానికులతో సమావేశమై అర్జీలను స్వీకరించారు.