
తిరుపతి వాసుల
“చిరకాల వాంఛ” నెరవేరింది… నవీన్ కుమార్ రెడ్డి నవంబర్ 30 తిరుపతి
టీటీడీ చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు గారి చేతుల మీదుగా స్థానికులకు మొదటి శ్రీవారి దర్శనం టోకెన్లను జారీ చేయాలని నవీన్ విజ్ఞప్తి…
తిరుపతి చంద్రగిరి రేణిగుంట రూరల్ వాసులకు “ఆధార్ కార్డు” ఆధారంగా శ్రీవారి దర్శన భాగ్యం దైవానుగ్రహం..
తుఫాను కారణంగా టోకెన్ల జారీ డిసెంబర్ 2 వ తేది సోమవారం నుంచి ప్రారంభం…
మాట తప్పని మడమ తిప్పని ఎన్డీఏ కూటమి నేతలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం…
బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి నగర ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన” భాగ్యాన్ని కల్పిస్తూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎన్డీఏ కూటమి అగ్ర నాయకుల ఆదేశాలతో మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటించడంతో టీటీడీ ఈవో శ్యామలరావు గారి ఆదేశాలతో అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి సూచనల మేరకు తిరుపతి జేఈవోలు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షణలో డిసెంబర్ 2 ( ఎల్లుండి) సోమవారం నుంచే దర్శన టోకెన్ల విడుదలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామం, అభినందనీయమన్నారు..
తిరుమల తిరుపతి స్థానికులతో పాటు తిరుపతి అర్బన్,రూరల్,చంద్రగిరి, రేణిగుంట మండలాలోని ప్రజలకు కూడా ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని నిర్ణయించడం దైవానుగ్రహం అన్నారు
తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు తిరుమల వాసులకు అలాగే మహతి ఆడిటోరియంలో తిరుపతి రేణిగుంట చంద్రగిరి అర్బన్ రూరల్ ప్రాంత ప్రజలకి టోకెన్ కౌంటర్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు..
శ్రీవారి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు సంయమనం పాటించాలని తోపులాటలు తొక్కిస్తాలాటలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టిటిడి అధికారులకు ప్రతి శ్రీవారి భక్తుడు సంపూర్ణ సహకారం అందించాలన్నారు!
టిటిడి టోకెన్ విడుదల కేంద్రాల వద్ద ఎటువంటి సిఫార్సులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతనిస్తూ టిటిడి విజిలెన్స్,స్థానిక పోలీస్ అధికారుల పర్యవేక్షణలో పటిష్టమైన క్యూలైన్ లను ఏర్పాటు చేయాలన్నారు…
శ్రీవారి దర్శన టోకెన్ల కోసం సెంటర్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని టిటిడి ఉన్నతాధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు!
నవీన్ కుమార్ రెడ్డి
బిజెపి నాయకులు