
కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు
డిసెంబర్ 1 : కర్నూల్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు నగరంలోని 1వ వార్డు లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ భాస్కర్, కర్నూలు ఐటిడిపి అధ్యక్షుడు మంద అఖిల్, బూత్ ఇంచార్జ్ లు, కిరణ్, ఆయత్ బీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.