
సిపిఐ (యం.యల్) లిబరేషన్ పార్టీ ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి..
డిసెంబర్ 1 : అనంతపురం
అనంతపురం నందు పార్టీ కార్యాలయంలో డిసెంబర్ 4వ తేదీ విజయవాడలో జరుగు “ప్రజా హక్కుల సభ ” కు సంబంధించిన గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి టియస్ వలి మరియు జిల్లా నాయకులు సి పరుశురాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ మాత్రమే కాదు ప్రజల కోరే పీపుల్ సిక్స్ సాధిద్దామంటూ మరి తెలుగు నెల నుంచి తరిమివేదం అంటూ ఆదివారం సిపిఐ (యం.యల్) లిబరేషన్ పార్టీ విజయవాడలో జింఖానా గ్రౌండ్ నందు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మరియు ర్యాలీని చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునివ్వడం జరిగింది. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు గత వైసిపి నాయకులు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా జనాకర్షణ కోసం సూపర్ సిక్స్ పేరుతో కూటమి నాయకులు ఎన్నికలకు పోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రజలు కూటమి పార్టీలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 6 నెలలు కావస్తున్న ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కదో పట్టించే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సామ్రాజ్యానికి చత్రపతిగా వ్యవహరించే విధంగా రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టబోతున్నాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సమస్యలను పక్కనపెట్టి మతాలను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి నాయకులు వ్యవహరించడాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వీటన్నిటికీ సమాధానంగా డిసెంబర్ 4వ తేదీ విజయవాడలో జరుగు ప్రజా హక్కుల సభను విజయవంతం చేయాలని ఈ సభలో ముఖ్య అతిథులుగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దింపాకర్ భట్టాచార్య మరియు పార్టీ సెంట్రల్ కమిటీ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వేమన, జిల్లా నాయకులు సుజాత, బాలకృష్ణ, టి.యస్. మహబూబ్ బాషా, మరియు తదితరులు పాల్గొన్నారు.