
అవినీతి సామ్రాట్ బిరుదుతో జగన్ ను సత్కరించాలా..? సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎద్దేవా
డిసెంబర్ 01 :కర్నూలు
వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి ఏం చేశారని ఆయనను సత్కరించి, శాలువా కప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు, ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు శాలువా కప్పాలా అని ప్రశ్నించారు. దేశంలోనే అవినీతి సామ్రాట్ అని జగన్కు సన్మానం చేయాలా అంటూ విమర్శించారు. విద్యుత్
వ్యవస్థలను రూ. లక్ష కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. జగన్ అవినీతి ఆనాడు రాష్ట్రం దాటితే.. ఇప్పుడు దేశం దాటిందన్నారు. రాష్ట్రం పరువు తీయడమే కాకుండా గొప్పలకు పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తప్పులను కప్పిపుచ్చుకొని అవినీతిని కూడా గొప్పగా చెప్పుకోవడం జగన్కు సాధ్యమని విమర్శించారు.