
నగర వనాన్ని ఆరోగ్యవరంగా తీర్చిదిద్దుతాం:
- మొదటి దఫాలో రూ. కోటితో రెండో దఫాలో మరో రూ. కోటితో హంగులు
- జిల్లా సబ్ డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు
మదనపల్లి డిసెంబర్ 3 :
మదనపల్లె బసినికొండలో రూ. రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాన్ని, పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్యవరంగా తీర్చిదిద్దు తున్నట్లు అన్నమయ్య జిల్లా సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఫారెస్ట్ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో పట్టణ ప్రజల సౌకర్యార్థం పుంగనూరు రోడ్డు, బసినికొండలో నగర వనాన్ని ఆరోగ్యవరంగా అన్ని రకాల హంగులతో తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇప్పటివరకు కోటి రూపాయల వరకు ఖర్చుపెట్టి నగర వనాన్ని అన్ని రకాల హంగులతో ఏర్పాటు చేశామన్నారు మరో కోటి రూపాయల నిధులను వెచ్చించి మదనపల్లె ఆరోగ్య వరాన్ని తలపించేలా ఇక్కడ కూడా మరో ఆరోగ్య వరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ జయప్రసాదరావు, డిఆర్ఓ మదన్ మోహన్, ఎఫ్బి వోలు ఏబీవోలు పాల్గొన్నారు.