RBI: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..!!
BVR today news..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న, సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి హామీ లేకుండా చిన్న, సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణాల పరిమితిని లక్షా 66 వేల నుంచి 2 లక్షలకు పెంచింది.ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో నెలకున్న ద్రవ్యోల్బణం దృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడంతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాల పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. హామీ లేకుండా పంట రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో ఆర్బీఐ సవరించింది. అప్పుడు రుణ పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.60 లక్షలకు పెంచింది. తాజాగా దీన్ని రెండు లక్షలకు పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పట్టదారు పాస్ బుక్ ను తాకట్టుగా పెట్టుకుంటున్నాయి. కాగా తెలంగాణలో పలువురి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేసింది. అయితే ఇప్పటి వరకు చాలా మంది అన్నదాతలకు రుణ మాఫీ కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం రుణ మాఫీ చేసుకుంటున్నట్లుగా ప్రకటించుకుంటుంది. తెలంగాణలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. ఇక రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు.వర్షాకాలం సీజన్ ముగిసినా రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి మొదలు కాబోతోంది. అయినా రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.