
మున్సిపల్ కమిషనర్ గారు…
కసాపురం దేవస్థానం ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు సమంజసం…
— ఇతర ప్రచారాల ఫ్లెక్సీల పట్ల మమకారం తగునా…
— భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ ..
డిసెంబర్ 8 గుంతకల్లు బి.వి.ఆర్ టుడే న్యూస్
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో జరుగు శ్రీ హనుమద్ జయంతి వేడుకల ప్రచార ఫ్లెక్సీలను పట్టణ ప్రధాన రహదారుల్లో ఏర్పాటును గుంతకల్లు పురపాలక సంఘం అధికారులు తొలగింపులుగా చేపట్టిన చర్యలు హేయమని, భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ ఉద్ఘాటించారు. ఆదివారం భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దీక్షాపరులతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హిందువుల పట్ల జరుగుతున్న అరాచకాలను తమ బిజెపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తీరుందని గుర్తించాలన్నారు. ఈ క్రమంలో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి హనుమద్ వ్రతం కార్యక్రమం నిర్వహణ ప్రచార సాధనాలుగా పట్టణంలో ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. కానీ గుంతకల్లు పురపాలక శాఖ అధికారులు తమ తమ అధికార దుర్వినియోగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయా ఫ్లెక్సీలను తొలగిస్తూ చర్యలు చేపట్టడం చాలా హేయంగా ఉందన్నారు. సదర అధికారులను ప్రశ్నిస్తే తమ అనుమతులు తీసుకోలేదంటూ బుకాయింపు ధోరణిగా మాట్లాడటం వారి విజ్ఞత ఏ పాటిదో తేటతెల్లమవుతుందన్నారు. పట్టణంలో మున్సిపల్ అనుమతులు లేమిగా ఏర్పాటులోని ఇతర ప్రచార సాధనాలుగా ప్రకటనల ఫ్లెక్సీలు ఉండటాన్ని మమకారంగా చూస్తూ అధికార దర్పంలో వారు స్వాగతిస్తు చోద్యం చూస్తున్న తీరు హేయమన్నారు. పట్టణంలో అనేక రకాలుగా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న తీరున్నా వాటి పట్ల మమకారం చూపడం, దేవాలయాల ప్రచారాల పట్ల వారు ఆదాయం చూసుకోవడం ఎంతవరకు సమంజసమని, మున్సిపల్ ఆదాయంలో అనేక రకాల అక్రమ కట్టడాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తూ తమ విధులను నిర్వహిస్తున్న తీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నామన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా విధుల చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులుగా విధులను కొనసాగించాలే కానీ ప్రస్తుతం మతముల ప్రాధాన్యతగా రెచ్చగొట్టే విధంగా అధికారులు విధుల నిర్వహిస్తున్న తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో తాము హిందువులుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంటుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు.