అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర….
బివిఆర్ టుడే న్యూస్ డిసెంబర్ 8 గుంతకల్లు
గుంతకల్లు పట్టణంలో ఆదివారం సాయంత్రం పాత గుంతకల్లు ప్రాంతంలోని శివాలయం నుండి పట్టణ ప్రధాన పురవీధులలో శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్షాపరులు శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తిని అత్యంత సుందరంగా విశేష అలంకరణ గావించి విద్యుత్ కాంతుల నడుమ ట్రాక్టర్ వాహనంలో ఉపస్తింపజేసి ప్రత్యేక పూజలతో పట్టణ ప్రాకారోత్సవంకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారి శోభాయాత్ర వాహనం ముందుగా దీక్షాపరులు భక్తి ప్రపత్తులతో శ్రీవారి నామస్మరణ గానం చేస్తూ కొనసాగారు. ఈ క్రమంలోనే పలువురు దీక్షాపరులు రహదారులలో శ్రీవారి హుండీలలో భక్తులచే కానుకల సమర్పణకు భిక్షాటన చేపట్టగా పలువురు శోభాయాత్ర ముందు బాణాసంచా పేల్చుతూ అంగరంగ వైభవంగా కొనసాగించారు. శోభాయాత్రలో భాగంగా పట్టణ పురవీధులలోని భక్తజనులు శ్రీ స్వామివారిని నేత్రానందకరంగా దర్శించుకుంటూ తమ మొక్కలను తీర్చుకున్నారు.
అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర…
RELATED ARTICLES