
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎస్ పెండేకల్ గ్రామ వీఆర్వో మృతి…
బివిఆర్ టుడే న్యూస్ డిసెంబర్ 16. మద్దికెర
అతివేగం ప్రమాదకరం అన్న నానుడికి తార్కాణంగా రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు మారుతున్న ప్రాణహానికరంతో కూడిన దయనీయమైన దుస్థితిలో రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారిన వైనంలో వాహనాల ప్రయాణంలో భాగంగా మద్దికెర మండలం బురుజుల గ్రామ సమీపంలోని వంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రెవెన్యూ గ్రామ వీఆర్వో మృత్యుపాలైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్ గ్రామంలో రెవెన్యూశాఖలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న కె.టి. శ్రీనివాసులు (37)అనే ఉద్యోగి తన ద్విచక్రవాహనంలో మద్దికెర నుండి పత్తికొండ వైపుగా రోడ్డుపై ప్రయాణిస్తూ బురుజుల వంక వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శవపరీక్షలు నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదరు మృతుడు తుగ్గలి మండలం రామకొండ పగిడిరాయి గ్రామనివాసి, ఆయనకు భార్య కళావతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానమన్నారు. ఈ ప్రమాద సంఘటన విషయంపై మద్దికెర పోలీసులు పూర్తి వివరాలతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.