ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్షణ పేరుతో పలువురు ఓ ప్రైవేట్ వైద్యకళాశాల విద్యార్థులు హల్ చల్…
— అడ్డుకున్న ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి.
— పలువురు వైద్యుల సహాయ సహకారంతో విద్యార్థుల హాజరు…?
బి.వి.ఆర్.టుడే న్యూస్, డిసెంబర్ 16, గుంతకల్లు.
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక అధికారులచే ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా విచ్చలవిడిగా పట్టణ శివారులోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థినిలు శిక్షణ పేరుతో తారసపడుతూ పలువురి వైద్య బృందం కు సహకారంగా విధులు నిర్వహిస్తున్న తీరుండడం గమనార్హం. సోమవారం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ శివారులోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన పలువురు (యుక్త వయసు గల) వైద్య విద్యార్థినీలు శిక్షణ పేరుతో ఆసుపత్రి వార్డులలో సంచరిస్తున్న తీరులో హల్ చల్ గా మారింది. సదరు ఆసుపత్రిలో పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామ్ ప్రసాద్ రావు గుర్తించి స్థానిక సెక్యూరిటీ సిబ్బందిచే వివరాలను సేకరించారు. దీంతో ఆయన ఆయా వార్డులలో పర్యటిస్తూ సదరు విద్యార్థినుల పట్ల ఆరా తీస్తూ సెక్యూరిటీ సిబ్బందిచే వారించి బయటకు పంపించేశారు. ఈక్రమంలో ఆయన తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా సదరు ప్రైవేట్ వైద్య కళాశాల యజమానిని తానేనంటూ తమ కళాశాలకు సంబంధించిన వైద్య విద్యార్థినీలకు శిక్షణ ఇస్తున్నట్లుగా చెప్పాలని, వారి శిక్షణ పట్ల ప్రత్యేక అధికార బృందం పరిశీలన చేస్తున్నారని వారితో శిక్షణ జరుగుతున్నట్లు పేర్కొనాలంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకు ఆయన ససేమిరా అంటూ తమ వద్ద వారి విద్యార్థినీల వివరాల ప్రభుత్వ ఉత్తర్వుల ఆమోద పత్రాలు లేకపోవడంను తాను సమ్మతించనని నిరాకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో గత ఫిబ్రవరి మాసంలో కూడా ఇదే తీరుగా పలువురు విద్యార్థినీలు శిక్షణ పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలో హల్ చల్ చేయగా అప్పుడు ఆయన ( ఏవో) ప్రశ్నించడంతో ఆ విద్యార్థినీలు పరుగులు పెట్టినవైనం లేకపోలేదు. మరోమారుగా సదరు వైద్యకళాశాలకు చెందిన ఆసుపత్రిలో శిక్షణ పేరుతో సంచరించడం కొసమెరుపు. వారు ప్రభుత్వ నిబంధనల అతిక్రమణ గా ఆసుపత్రిలో సంచరించడం ఏదేని ప్రమాద సంఘటనల చర్యలకు బాధ్యులు ఎవరు అన్న చర్చలు ఆసుపత్రి ప్రాంగణంలో గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. ఇలా సదరు కళాశాలకు చెందిన విద్యార్థినీలు ఆసుపత్రిలో శిక్షణ పొందేందుకు ఆసుపత్రి అధికార యంత్రాంగం దృష్టికి లేమిగా పరోక్షంగా పలువురు వైద్య బృందం సహాయ సహకారాలతో ఇలా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆసుపత్రి పర్యవేక్షణ అధికారిని వివరణ కోరగా జరిగినది వాస్తవమేనని, ఈ విషయంపై తాను ఆ కళాశాల యాజమాన్యం వద్ద ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించడం తాను సహించని ఉన్నతాధికారులకు సమాచారం అందజేస్తామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్షణ పేరుతో పలువురు ఓ ప్రైవేట్ వైద్యకళాశాల విద్యార్థులు హల్ చల్…– అడ్డుకున్న ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి.
RELATED ARTICLES