Tuesday, July 29, 2025
spot_img

అయ్యా ముఖ్యమంత్రి గారూ…విద్యుత్ చార్జీల బాదుడుగా ఇదేనా సంపద అంటే…. — వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

అయ్యా ముఖ్యమంత్రి గారూ…

విద్యుత్ చార్జీల బాదుడుగా ఇదేనా సంపద అంటే…. — వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి.

బి.వి.ఆర్.టుడే న్యూస్, డిసెంబర్ 27 పత్తికొండ.విద్యుత్ చార్జీలు పెంపుదలతో ప్రజల నడ్డి విరిచే బాదుడుగా ఇదేనా సంపద అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అంటూ పత్తికొండ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో అంబేద్కర్ కూడలి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి నాలుగు స్తంభాల కూడలిలో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలలోనే విద్యుత్ చార్జీల బిల్లులు దాదాపుగా 15,400 కోట్లు పెంచి ప్రజల నడ్డి విరిగేలా పెనుభారం మోపడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మోస పూరితమైన పాలనకు నిదర్శనంగా ప్రజలు గుర్తిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారూ ఇదేనా సంపద అంటే అని ప్రశ్నించారు. గత కొద్దికాలం క్రితం పత్తికొండలో జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేస్తూ సంపద అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని చేయని పక్షంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నాయకులుగా కూటమి ప్రభుత్వం మెడలు వంచి ప్రజాగ్రహంతో పనిచేపిస్తామని హెచ్చరించారు. తదుపరి విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గంలోని ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular