
*సీఎం కి నా ప్రత్యేక ధన్యవాదములు :యువనాయకుడు గుమ్మనూరు ఈశ్వర్*
బి వి ఆర్ టుడే న్యూస్: (గుత్తి)
నేడు గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణం నందు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు *డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం* అమలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా గుత్తి పట్టణం ప్రభుత్వ బాలికల కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు *గుమ్మనూరు జయరాం* గారి తనయుడు యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్* మరియు పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్* మరియు గుమ్మనూరు జయరాం సోదరుడు *గుమ్మనూరు నారాయణ* హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు కూడా కళాశాల నందు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది నిజంగా విద్యార్థుల పాలిట వరం అని ఎందుకంటే విద్యార్థులు బాగా చదవాలి అంటే అందుకు సరైన భోజనం కూడా ముఖ్యమని సరైన భోజనం తినడం ద్వారా విద్యార్థులు మరింత ఉన్నత విద్యను నేర్చుంటారని అన్నారు ఈ పథకాన్ని అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు కి తన ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని గుమ్మనూరు ఈశ్వర్ తెలిపారు.. ఈ కార్యక్రమం లో గుత్తి పట్టణ, మండల కూటమి సభ్యులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు…