Wednesday, April 23, 2025
spot_img
Home Blog Page 16

తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

0

అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం

తిరుపతి నవంబర్ 6

ఘనంగా తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు
-ముఖ్య అతిథులుగా తిరుపతి చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు , టిటిడి బోర్డు సభ్యులు, తిరుపతి జిల్లా ఎస్పీ తో పాటు

ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు హాజరు

తిరుపతి ప్రెస్ క్లబ్ కి స్థలంతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు ఎమ్మెల్యేల హామీ

ఆనందం వ్యక్తం చేసిన నూతన కమిటీ నేతలు సభ్యులు, జర్నలిస్టు సోదరులు వారి కుటుంబ సభ్యులు

ఆకట్టుకున్న కళాకారుల గేయాలు. తిరుపతి ప్రెస్ క్లబ్ సొంత భవనానికి, అలాగే జర్నలిస్టుల ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తిరుపతి , చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, మురళీమోహన్ స్పష్టం చేశారు. తిరుపతి తుడా కచ్చపి సమావేశ మందిరంలో బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి చిత్తూరు ఎంపీ ప్రసాద్, అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, వేదిక్ యూనివర్సిటీ విసి రాణి రాధా మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టు సోదరులకు సొంత భవనం ఇవ్వడంతో పాటు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జర్నలిస్టు సోదరులు మాకు సహాయ సహకారాలు అందిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిని రాకెట్ వేగంతో మరింత అభివృద్ధి చేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నేతల గొప్పతనాన్ని నన్ను దిశల చాటి చెబుతామన్నారు. అంతేకాకుండా గంజాయి మత్తు నుండి యువతను కాపాడుతామన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తిరుపతి పట్టణంలో జర్నలిస్టు సోదరులకు సొంత భవనానికి, ఇంటి స్థలాలకు స్థలాలు లేకుంటే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రూరల్ ప్రాంతంలో స్థలాలు ఇచ్చి వారికి అండగా ఉంటామన్నారు. గంజాయి అనేది చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ లేకుండా గట్టి నిగా పెట్టడంతో పాటు గంజాయిని ఎక్కడికక్కడే అరికట్టేందుకు తగు చర్యలు పోలీసులు ద్వారా తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే పూతల పట్టు మురళితో జర్నలిస్టు సోదరుల సమస్యలపై పలు తపాలా చర్చించుకోవడం జరిగిందన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా ఎమ్మెల్యేగా జర్నలిస్టు సమస్యలను క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలుస్తుంది అని వారి యోగక్షేమాలను గుర్తించుకోవడంతోపాటు తిరుపతి ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం అలాగే జర్నలిస్టు ల ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సుముఖముగా ఉన్నామని తన వంతు పూర్తి సహాయ సహకారాలు జర్నలిస్టు సోదరులకు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సోదరుల సమస్యలను పరిష్కరించడంలో మేము ముందున్నామని దీనిపై అవసరమైతే బిజెపి ఉన్నత అధికారులతో మాట్లాడతామని చెప్పారు. ఎంపీ ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు వారి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గంజాయి అనే మాట తిరుపతి జిల్లాలో వినపడనీయకుండా చేస్తామని అయితే గంజాయి గురించి జర్నలిస్టు మిత్రులకు ఎవరికైనా తెలిసిన తమకు తెలియజేయాలే తప్ప పేపర్లో తప్పుడు కథనాలు రాస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జర్నలిస్టులతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. వారికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కళాకారుల పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అంతకుముందు తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శి ఆర్ మురళి, బాలు మాట్లాడుతూ తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై విజయవంతం చేసిన జర్నలిస్టు సోదరులు వారి కుటుంబ సభ్యులకు పార్టీలకు హాజరైన పలువురు ప్రముఖులకు పెద్దలకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సోదరులు నూతన కమిటీ నేతలు సభ్యులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ నేతలు సభ్యులను పలువురు సెల్వ పుష్ప గుచ్చాలతో సత్కరించి అభినందించారు.

పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు సుడిగాలి పర్యటన…

0

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..

సచివాలయం 3, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మోడల్ స్కూల్ పరిశీలన
పత్తికొండ : విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు హెచ్చరించారు. బుధవారం పత్తికొండలో ఆయన సుడిగాలి పర్యటన చేసి సచివాలయం3, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మోడల్ స్కూల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం-3 లో అటెండర్ రిజిస్టర్ను పరిశీలించారు. కార్యాలయంలో ఒక ఉద్యోగి ఉండడంతో మిగిలిన వారు ఎక్కడని ప్రశ్నించారు. ఫీల్ కు వెళ్లారని చెప్పడంతో మీ కార్యాలయంపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్ప వని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రంలో కాలం చెల్లిన యూరియా బస్తాలు చూసి ఇదేంటని సిబ్బందిని ప్రశ్నించారు. అధికారులకు తెలిసిన అక్కడ సిబ్బంది చెప్పడంతో వెంటనే అవన్నీ క్లీన్ చేసి కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని మరోసారి తనిఖీకి వచ్చినప్పుడు ఇలాంటివి కనిపిస్తే చర్యలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు వేసిన వ్యాక్సిలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న సమస్యల గురించి సిబ్బంది ఆయనకు తెలపడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడినుంచి మోడల్ స్కూల్ కి వెళ్లిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో పనిచేయని ఆరో ప్లాంట్ పై ప్రిన్సిపాల్ ని ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఎలా వృధాగా వదిలేస్తారని వెంటనే దాన్ని బాగు చేయించాలని చెప్పారు. పాఠశాలలో ఉన్న ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న పత్తికొండ ప్రాంతంలో విద్యార్థులకు చదివి ఎంతో అవసరం అన్నారు. పదవ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో మంచి అవకాశం విద్యార్థులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును అందుకోవాలని సూచించారు. ఆయనతోపాటు టిడిపి నాయకులు సాంబశివరెడ్డి తుగ్గలి నాగేంద్ర మనోహర్ చౌదరి తదితరులు ఉన్నారు

bvrtodaynews

0

మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు

స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టండి

ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టండి

రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసే వారికి త్వరితగతిన అనుమతులు

ఇంటర్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్

అమరావతిః ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటునకు ప్రణాళికలు రూపొందించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ఇంటర్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను దినపత్రికల్లో ప్రచురించేలా కసరత్తు చేయాలన్నారు. రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే వారికి త్వరితగతిన అనుమతులు అందించాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల 15వేల వరకు అడ్మిషన్లు పెరిగాయనే విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వచ్చే ఏడాది 2 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. జూనియర్ కాలేజీల్లో పనివేళలు పెంచడంతో పాటు విద్యార్థుల హాజరుపై సమీక్ష, ప్రోగెస్ కార్డులను అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తమ అధ్యాపకులతో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులకు శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


bvr today news.

0

మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు

స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టండి

ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టండి

రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసే వారికి త్వరితగతిన అనుమతులు

ఇంటర్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్

అమరావతిః ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటునకు ప్రణాళికలు రూపొందించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ఇంటర్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను దినపత్రికల్లో ప్రచురించేలా కసరత్తు చేయాలన్నారు. రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే వారికి త్వరితగతిన అనుమతులు అందించాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల 15వేల వరకు అడ్మిషన్లు పెరిగాయనే విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వచ్చే ఏడాది 2 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. జూనియర్ కాలేజీల్లో పనివేళలు పెంచడంతో పాటు విద్యార్థుల హాజరుపై సమీక్ష, ప్రోగెస్ కార్డులను అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తమ అధ్యాపకులతో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులకు శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Bvr today news

0

కోర్టు తీర్పులను విమర్శించే హక్కు
మీడియాకుంది : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కోర్టులు ఇచ్చే తీర్పులను నిష్పక్షపాతంగా విమర్శించే హక్కు మీడియాకు ఉందని సుప్రీంకోర్టు
స్పష్టం చేసింది.
రాజ్యాంగం అందించిన ప్రాథమిక
హక్కైన భావప్రకటనా స్వేచ్ఛలో ఇది భాగమేననితెలిపింది.
తీర్పులను సహేతుకంగా విమర్శించటంనేరం కాదని, అదొక హక్కని పేర్కొంది.
న్యాయమూర్తులతో సహా ఎవరూ లోపరహితులు కాదని…
సద్విమర్శలను ప్రోత్సహించాలని తెలిపింది.
కేంద్రమానవవనరుల మంత్రి కపిల్
సిబాల్, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆ పత్రికా విలేకరిలపై దాఖలైన కోర్టు ఉల్లంఘన కేసుపై శుక్రవారం విచారణ జరిపిన
సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. 1995లో న్యాయవాదిగా ఉన్న సిబాల్..
న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై టైమ్స్ఆఫ్ండియాలో ఒకవ్యాసం రాశారు.
దానిపై కోర్టు ఉల్లంఘన కేసు నమోదైంది.

అంబటి తంటా… సిబ్బంది పై మంట..?

0

అంబటి షర్ట్ పై జగన్ ఫోటో తెచ్చిన తంటా…. తి.తి.దే. సెక్యూరిటీ అధికారులపై బదిలీ మంట…?

మాజీ సిఎం, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించిన చొక్కా వేసుకొని, దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేష్టలు సెక్యూరిటీ సిబ్బందికి శాపంగా పరిణమించిన వైనం. మాజీ మంత్రి అంబటి రాంబాబు శ్రీవారి దర్శనం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో తిరుమలలో నలుగురు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులను బదిలీ చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల జారీచేశారని సమాచారం…!!!

0

విశేష అలంకరణలో దర్శనమిచ్చిన ” శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు “…

– నేత్రానందకరంగా దర్శించుకున్న భక్తజనులు..

బి వి ఆర్ న్యూస్ ; నవంబర్ 04 గుంతకల్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన దక్షిణా కాశి గా పేరొందిన శైవ క్షేత్రం శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి దేవస్థానం. అనంతపురం జిల్లా గుంతకల్లు కర్నూలు జిల్లా రహదారి లో గల సంఘాల గ్రామ సమీపంలో ఏపీ రాష్ట్ర పురావస్తు శాఖ వారు గుర్తించిన శిలా శాసనంపై గుర్తించిన శకవర్షములు 1441 క్రీస్తు శకం 15వ శతాబ్దం నాకు చెందిన విజయనగర సామ్రాజ్యం రాజు అయిన శ్రీకృష్ణదేవరాయల వారిచే ఆలయం నిర్మితమైనట్ల పూర్వీకుల నానుడి. పరమశివునికి ప్రీతికరమైన మాసములలో కార్తీకమాసం ఒక విశిష్టత అందులో కార్తీకమాసం సోమవారం వారిని దర్శించిన పూజించిన, అభిషేకించిన , భక్తాదులకు పుణ్యబలం లభిస్తుందన్నది ప్రతితి . కార్తీక మాసం లో కార్తీక సోమవారాలుగా నవంబర్ 4వ,11వ తేదీ ,18వ తేదీ ,25వ తేదీ ల లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడునని ఆలయ అర్చక బృందం తెలిపారు. ఈ క్రమంలో వరమ పవిత్ర కార్తీక పౌర్ణమి 15వ తేదీ శివప్రతి దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తాదుల చే సంయుక్తంగా తాము నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారి మూలవరులకు విశేష పంచామృత అభిషేకాల బిల్వపత్రములచే వైదికంగా అర్చక బృందం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల వివిధ ప్రాంతపు భక్తజనులు శ్రీవారిని దర్శించుకుని తమ తమ మృక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయా భక్తులకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏ కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది గ్రామ పెద్దలు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు

0

విశేష అలంకరణలో దర్శనమిచ్చిన ” శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు “…- నేత్రానందకరంగా దర్శించుకున్న భక్తజనులు..- బి వి ఆర్ న్యూస్ ; నవంబర్ 04 గుంతకల్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన దక్షిణా కాశి గా పేరొందిన శైవ క్షేత్రం శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి దేవస్థానం. అనంతపురం జిల్లా గుంతకల్లు కర్నూలు జిల్లా రహదారి లో గల సంఘాల గ్రామ సమీపంలో ఏపీ రాష్ట్ర పురావస్తు శాఖ వారు గుర్తించిన శిలా శాసనంపై గుర్తించిన శకవర్షములు 1441 క్రీస్తు శకం 15వ శతాబ్దం నాకు చెందిన విజయనగర సామ్రాజ్యం రాజు అయిన శ్రీకృష్ణదేవరాయల వారిచే ఆలయం నిర్మితమైనట్ల పూర్వీకుల నానుడి. పరమశివునికి ప్రీతికరమైన మాసములలో కార్తీకమాసం ఒక విశిష్టత అందులో కార్తీకమాసం సోమవారం వారిని దర్శించిన పూజించిన, అభిషేకించిన , భక్తాదులకు పుణ్యబలం లభిస్తుందన్నది ప్రతితి . కార్తీక మాసం లో కార్తీక సోమవారాలుగా నవంబర్ 4వ,11వ తేదీ ,18వ తేదీ ,25వ తేదీ ల లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడునని ఆలయ అర్చక బృందం తెలిపారు. ఈ క్రమంలో వరమ పవిత్ర కార్తీక పౌర్ణమి 15వ తేదీ శివప్రతి దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తాదుల చే సంయుక్తంగా తాము నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారి మూలవరులకు విశేష పంచామృత అభిషేకాల బిల్వపత్రములచే వైదికంగా అర్చక బృందం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల వివిధ ప్రాంతపు భక్తజనులు శ్రీవారిని దర్శించుకుని తమ తమ మృక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయా భక్తులకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏ కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది గ్రామ పెద్దలు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు