Wednesday, April 23, 2025
spot_img
Home Blog Page 15

రేషన్ బియ్యం, బొలెరో వాహనం సీజ్.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు..

0

80 ప్యాకెట్ల బియ్యంతో పాటు ఓ బొలెరో వాహనం సీజ్….. ఇద్దరు వ్యక్తుల అరెస్టు..

గుంతకల్లులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ను పలువురు అక్రమంగా ఇతర ప్రాంతాలకుతరలిస్తున్న వైనం లో అధికారుల అలసత్వం బహిర్గతంగా కావడం హేయం. గురువారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో గుంటకల్ పట్టణంలోని టీవీ స్టేషన్ దగ్గర కూడలి వద్ద టూ టౌన్ పోలీసు వారు వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో బొలెరో వాహనంలో దాదాపు 3600 కేజీలు గల 80 బస్తాలు రేషన్ బియ్యం గుత్తి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న గుత్తి ప్రాంతానికి చెందిన నాగ శేషు , హరి ప్రసాద్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సదరు సంఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి పట్టుబడిన బియ్యం ను అప్పగించారు.

16 మంది ఏఈఓ లుగా ప్రదోన్నతి కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి.

0

అనంతపురం జిల్లాలో 16 మంది కి ఎఈఓలుగా పదోన్నతి…
అనంతపురం జిల్లా వ్యాప్తంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న 16 మంది కి ప్రధానోతి కల్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. గోరంట్ల ,తనకల్లు, బి కేసముద్రము ,కుందుర్పి, రాయదుర్గము, బ్రహ్మసముద్రం, పామిడి, కనేకల్లు ,బత్తలపల్లి, పరిగి, అమడ గూడూరు, సింగనమల ,వజ్రకరూరు, విడపనకల్లు ,,రామగిరి, ముదిగుబ్బ వారికి కేటాయించామన్నారు

APAAR కోసం స్కూల్ రికార్డ్స్ కరెక్షన అధికారాలు బదలాయింపు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు..

0

అపార్ (APAAR) కోసం స్కూల్ రికార్డ్స్ కరెక్షన్ అధికారాలు బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు….

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల రికార్డులలో అవసరమైన దిద్దుబాటు కోసం మార్చి 2025 వరకు తాజా అధికారాల బదలాయింపు కొనసాగింపు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా పరిధిలోని MEOలు / ప్రధానోపాధ్యాయులు GrII / DYEO లకు అధికారాల డెలిగేషన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సదరు ప్రభుత్వ ఉత్తర్వులలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ,ప్రాథమికోన్నత పాఠశాలల వరకు MEO లకు అధికారాలు ఇచ్చారు. అలాగే ZP , GOVT, MPL ఉన్నత పాఠశాలలకు గ్రేడు టు హెడ్ మాస్టర్లకు అధికారాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు డివై ఈవో లకు అధికారం ఇచ్చారు. సదరు ఉత్తర్వులు మార్చి 2025 వరకు తాజా అధికారాల బదలాయింపు కొనసాగుతుందని ఉత్తరంలో పేర్కొన్నారు.

వర్క్ షాప్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

0

అనంతపురం. 08.11.2024

అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో శుక్రవారం “ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో ఏపీ పెడికాన్ 2024 వర్క్ షాప్ నిర్వహించారు. సదరు వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S, పాల్గొని పరిశీలించారు.

ఏపీలో దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్ట్ భర్తీ: మంత్రి ఆనం.

0

ఏపీలో దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

అమరావతి :

ఏపీలో దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు త్వరలోనే దేవాలయ ట్రస్టు బోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతా మూర్తుల మంత్రోచ్చారణవినిపించాలని పేర్కొన్నారు.

ప్రపంచ క్యాన్సర్ డే అవగాహన ర్యాలీలో సంయుక్తంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ తిరుపతి ఎమ్మెల్యే.

0

ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీలో సంయుక్తంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ తిరుపతి ఎంఎల్ఏ

  • అవగాహన ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు
    :- జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
  • క్యాన్సర్ వ్యాధి నివారణ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి
    : తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు

Bvr టుడే న్యూస్ తిరుపతి-సిటీ ప్రతినిధి చంద్రకళ) నవంబర్ 7 :

నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాది పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.గురువారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయం స్విమ్స్ ఆసుపత్రి ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ లో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు , ఎన్.యు.హెచ్.ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. జె.విజయలక్ష్మి డీఎంఎచ్ ఓ డా. శ్రీహరి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రస్తుత రోజుల్లో నమోదవుతున్న మరణాలలో క్యాన్సర్ బారిన పడి 5 వ వంతు మరణాలు క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నాయని, వీటిలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాదులతో మరణిస్తుస్తున్నారని, ముఖ్యంగా రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్ లను ముందుగా స్క్రీనింగ్ చేసి అరికట్టవచ్చని తెలిపారు. , కొంతమంది క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నప్పటికీ అవగాహన లేక సరైన సమయానికి చికిత్స అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధి మరియు నివారణ మార్గాల పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్లి పై తెలిపిన మూడు రకాల క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ తో పాటు బి.పి మరియు డయాబెటిస్ లను కూడా స్క్రీనింగ్ చేయాలని తెలిపారు.
బ్రెస్ట్ క్యాన్సర్,సర్వైకల్ క్యాన్సర్ అనేది 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తోందని ఈ లక్షణాలు కల వారిని ముందుగానే స్క్రీనింగ్ లో గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ముందుగా చికిత్స అందించాలని అందుకు సంబంధించిన రేడియోథెరపీ గానీ, కీమోథెరపీ గానీ చేయించాలని అన్నారు. ఈ చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా రుయా, స్విమ్స్ ఆసుపత్రులో అందుబాటులో ఉంచిందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ రోజున క్యాన్సర్ కు సంబంధించిన అవగాహన ర్యాలీనీ తిరుపతి పట్టణం లో నిర్వహించడం జరిగిందని అన్నారు.తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ … ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి నివారణ దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎం.ఎల్.ఏ సుగుణమ్మ, రుయా, సిమ్స్ ఆస్పత్రుల సుపరిండెంట్లు డా. రవి ప్రభు, డా. రామ్, ఆర్ ఎం ఓ డా. కోటిరెడ్డి, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. చంద్రశేఖర్, స్విమ్స్ క్యానర్ విభాగ నోడల్ ఆఫీసర్ డా.నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ (PRO ) రాజశేఖర్, ఒమేగా, టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి.

0

అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి

ఏక్ పెడ్ మా కి నామ్ యువతకు పిలుపు
రామ్ అకాడమీ కాలేజ్ కరస్పాండెంట్ ఎం మధుసూదన్ …
తిరుపతి ఎంఆర్ పల్లి లోని న్యూ బాలాజీ కాలనీ రామ్ అకాడమీ కాలేజ్ నందు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ సారధ్యంలోని నెహ్రూ యువ కేంద్ర సహకారంతో పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా యూత్ ఆఫీసర్ ప్రదీప్ డిస్టిక్ అకౌంట్స్ ఆఫీసర్ బాబు రెడ్డి సూచనల మేరకు ” ఏక్ పెడ్ మా కి నామ్ “( అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి ) అనే అవగాహన సమావేశం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ , తిరుపతి అర్బన్ మండలం బయోడైవర్సిటీ కమిటీ కోఆర్డినేటర్ పి అమర్నాథ్ తెలియజేసినారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రామ్ అకాడమీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ సాయి కళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ ఎం. మధుసూదన్ విచ్చేసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థులు యుక్త వయసు నుండే సమాజం పట్ల అవగాహన పెంచుకొని తమ బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నివారణకు, పచ్చదనం పరిశుభ్రత పెంచుటకు, ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు నిరంతరం మరియు మొక్కలు నాటడం కోసం తమ చుట్టూ యువతను ఉన్న వారిని చైతన్యవంతులను చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అనే కార్యక్రమంలో పాల్గొని మొక్కల నాటాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే మరో పర్యావరణ వేత్త మార్గదర్శి అభ్యుదయ సేవా సమితి కార్యదర్శి ఎన్ దొర స్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతీ యువకులలో భూ సంరక్షణ, పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన మరియు రీసైకిలింగ్ గురించి అనేక రూపాలలో ప్రచార కార్యక్రమాలు చేపట్టడుతున్నారు, దీనిలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీ భారతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఎస్ ఎన్ రాజా, కెమిస్ట్రీ లెక్చరర్ అర్ వి ప్రభాకర్ రాజు తిరుపతి మండలం ఫారెస్ట్, బయోడైవర్సిటీ కమిటీ మెంబర్లు జీ శ్రీనివాసులు, ఏం వెంకటేష్, ఎం రమేష్ మరియు యువతీ యువకులు పాల్గొన్నారు.

గుత్తి గేట్స్ కళాశాలలో ఈనెల 11వ తేదీన “ఉచిత కంటి వైద్య శిబిరం”.

0

ఈనెల 11న గుత్తి గేట్స్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు…


ప్రతి ఒక్కరిలో కంటిచూపు ఎంతో ప్రాధాన్యం. ఈనెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు గుత్తి పట్టణంలో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో ఓ ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం తెలిపిన వివరాల మేరకు గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడు దివంగత శ్రీ వి కే సుధీర్ రెడ్డి గారి 7 వ వర్ధంతిని పురస్కరించుకొని సక్ష్యమ్ అనే స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షల నిర్వహణతో అవసరమైన కంటి ఆపరేషన్ చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. సదరు వైద్య శిబిరంకు ఉదయం 9 గంటలకు తమ కళాశాలకు వైద్య పరీక్షల నిమిత్తం బాధితులు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో ప్లాంట్ మరమ్మత్తులకు చర్యలు…

0

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచినీటి సౌకర్యం కల్పన…

  • ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు చర్యలు…

గత కొన్నేళ్లుగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్ గుంతకల్లు పర్యటనలో భాగంగా ఆసుపత్రి తనిఖీలు ప్రధానంగా త్రాగునీటి సమస్యను గుర్తించారు. సదరు సమస్య పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ఆకుపత్రిలో వివిధ సమస్యలపై వివరాలను ఆయన అందించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిసిహెచ్ఎస్ ఉత్తర్వులతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలిట వరంగా దాదాపు లక్ష రూపాయల మేర వేయంతో ఆర్వో ప్లాంట్ నిర్వహణకు మరమ్మతుల చర్యలకు గురువారం స్థానిక ఏవో రాంప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ అజేంద్ర రావు శ్రీకారం చుట్టారు.

నోటరీ సర్టిఫికెట్ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు….

0

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో…

డిసిహెచ్ఎస్ చర్యలు అమలు…
-ప్రత్యేక సిబ్బంది నియామకం .
-మార్పులు చేర్పులు నోటరీ సర్టిఫికెట్ తో చేసుకోవచ్చు..
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి జనన మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు జారీలో జరుగుతున్న జాప్యంపై డిసిహెచ్ఎస్ అధికారి డాక్టర్ పాల్ రవికుమార్ చర్యలు చేపట్టారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్ లైన్ నమోదు ప్రక్రియలో సిబ్బంది ఆలక్ష్యంపై డిసిహెచ్ఎస్ తనదైన శైలిలో కొరడా ఝులిపించిన వైనం. ఇటీవల ఆయన ఆకస్మికంగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సిబ్బంది చేపడుతున్న రోగుల పట్ల సేవలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల ఆన్లైన్ నమోదు లో జరుగుతున్న జాప్యంపై పలు ఫిర్యాదులుగా తనకు అందిన సమాచారంతో ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. తన పర్యటనలో భాగంగా చేపట్టిన తనిఖీలలో వైద్య ఆరోగ్య సిబ్బంది కొరత, ఆన్లైన్ వెబ్సైట్ లో జరుగుతున్న అనివార్య సంఘటనలను గుర్తించారు. ఈ క్రమంలో జనన మరణ ధ్రువీకరణ ఆన్లైన్ నమోదులో సిబ్బంది చేస్తున్న జాప్యం పనితీరుపై అసంతృప్తి వ్యక్తంతో చర్యలకు ఉపక్రమించినట్లు స్థానిక ఆసుపత్రి ఏవో రాంప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఆన్లైన్ నమోదులో భాగంగా ఆసుపత్రిలో పలువురు సిబ్బంది వివిధ శాఖలలో సమయపాలన వర్తింపు దిశగా ఓ ఐదు మంది సిబ్బంది నియామకం ద్వారా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. సదరు సిబ్బందిచే ప్రజలకు జనన మరణ ధ్రువీకరణ ఆన్లైన్ నమోదు తో సర్టిఫికెట్ల మంజూరు చేస్తూ లబ్ధిదారులకు సులభతరంగా అందజేయుటకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆడియో మెట్రీషియన్ విధులు నిర్వహిస్తున్న గణేష్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ రమేష్, శానిటేషన్ సూపర్వైజర్ పరుశురాముడు, డెంటల్ హైజనిస్ట్ శివకుమార్ హెల్త్ కౌన్సిలర్ ఆశ తదితర సిబ్బంది నియామకంతో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జనన మరణ ధ్రువీకరణ పత్రాలలో భాగంగా లబ్ధిదారుల ఇంటి పేరు తదితర పలు అంశాల మార్పులు చేర్పులు అనివార్యంగా ఆదేశాలున్నాయి. సదరు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేస్తున్న సదరు సిబ్బంది లబ్ధిదారులను తమ ఆసుపత్రి వద్దకు పంపుతున్న వైనం ఉంది. ఆ వైనంలో భాగంగా 2016 మే మాసం కు ముందు ఆన్లైన్ సౌకర్యం లేమి కారణంగా ఆన్లైన్ నమోదులో నోటరీ సర్టిఫికెట్ తో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందన్న సత్యాన్ని సదరు అధికారులు గుర్తించాలన్నారు. ఈ విషయంలో ప్రజలను తమ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలుగా చేపడుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు నోటరీ సర్టిఫికెట్ ఆమోదంతో మార్పులు చేర్పులకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.