జిల్లా కలెక్టర్ ను కలిసిన శ్రీకాళహస్తి ఈవో…
నవంబర్ 11 :తిరుపతి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా టి బాపిరెడ్డి మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను గౌరవపూర్వకంగా కలెక్టరేట్లో కలిశారు.

గేట్స్ కళాశాలలో మెగా కంటి వైద్య శిబిరం…
నవంబర్ 11: గుత్తి
గేట్స్ కళాశాల అధినేత వికే సుధీర్ రెడ్డి ఏడవ వర్ధంతి పురస్కరించుకొని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల, సక్షo స్వచ్ఛంద సంస్థ వారు సోమవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య శిబిరానికి హాజరైన 300 మంది కి కడప పుష్పగిరికి చెందిన కంటి వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు వీటిలో వందమంది కంటి శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారిని పుష్పగిరి వైద్యశాలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు అవసరమైన వారికి కంటి అద్దాలు సూచించారు. కళాశాల డైరెక్టర్ శ్రీ వాణి మాట్లాడుతూ కంటే వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం కేవలం గేట్స్ సంస్థ మీద ఉన్న నమ్మకంఅన్నారు. అలాగే వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు కళాశాల యాజమాన్యం వారు శిబిరానికి హాజరై వారికి భోజన సౌకర్యాలు కల్పించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వీకే పద్మావతి, ఎండి రఘునాథ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ,సక్షo జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, గేట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ,అధ్యాపకులు పాల్గొన్నారు
శ్రీశైల మహా క్షేత్రంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం….
నవంబర్ 11 : శ్రీశైలం
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయం వద్దశ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయం వద్ద ఉన్న పుష్కరణి దగ్గర లక్ష దీపోత్సవం కార్యక్రమం అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు,పుష్కరిణికి దశవిధ హారతులు ఇవ్వడం జరిగింది.
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష పూజలు…
నవంబర్ :11 గుంతకల్లు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పరిధిలోని
ఉపాలయం శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీకమాసం సోమవారం పురస్కరించుకొని శ్రీవార్ల మూలవర్లకు ఆలయ అధికారులు పర్యవేక్షణలో అర్చక బృందం మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, పూజలు వైదికంగా నిర్వహించారు.
శ్రీ నెట్టికంటుని సన్నిధిలో వైదికంగా తిరుమంజన స్నపనము.. మన్యుసూక్త హోమం…
నవంబర్ 11, గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి జన్మ నక్షత్రంను పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. సోమవారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ అధికారుల పర్యవేక్షణలో వేద పండితులు, అర్చక బృందం సంయుక్తంగా యాగశాలలో శ్రీవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై ఉపస్తించి తిరుమంజన స్నపనము (అభిషేకం) గావించి ప్రత్యేక పూజలతో పాటు మన్యుసూక్త హోమంను వైదికంగా నిర్వహించారు.
విశేష పూజలు అందుకున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు…
-అర్ధనారీశ్వర అలంకారంలో పార్వతీదేవి….
— కార్తీక దీపోత్సవ వేడుకలతో మ్రొక్కులు తీర్చుకున్న భక్తాదులు…
నవంబర్ 11, గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుని ఆలయంలో కార్తీకమాస ఉత్సవ అభిషేకాలతో విశేష అలంకరణలతో శ్రీవార్లకు ప్రత్యేక పూజలతో భక్తులు మ్రొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసం రెండవ సోమవారంను పురస్కరించుకొని దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఏ. కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బృందం సంయుక్తంగా శ్రీవారి మూలవర్లకు పంచామృత రుద్ర అభిషేకములు, బిల్వపత్రములు వివిధ పుష్పముల అలంకరణతో పాటు తమలపాకులు తదితర పూజా సామాగ్రితో విశేష పూజలను చేపట్టారు. యధావిధిగా శ్రీవార్ల ఉత్సవమూర్తులను పలువురు గ్రామ పెద్దలు ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనులు శ్రీ వార్లను నేత్రానందంగా దర్శించుకున్నారు. అలాగే భక్తాదులు ఆలయ ప్రాంగణంలోని అశ్వర్థవృక్షం వద్ద తమ తమ మొక్కుబడులుగా కార్తీక దీపోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకోవడం విశేషం. కాగా ఈ ఏడాది విశేషంగా శ్రీ పార్వతీదేవి అమ్మవారు మూల మూలవర్లకు అర్చక బృందం ప్రత్యేకంగా అర్ధనారీశ్వర అలంకరణ గావించి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తాదులు శ్రీవార్లను భక్తిపారవశ్యంతో దర్శించుకుని తమ తమ మ్రొక్కులను తీర్చుకున్నారు. తదుపరి ఆలయ పరిసరంలో ఏర్పాటుచేసిన నిత్యాన్నదాన కేంద్రంలో భక్తాదులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ నెట్టికంటుని సన్నిధిలో కార్తీక మాసోత్సవ ప్రత్యేక పూజలు…
నవంబర్ 09 గుంతకల్లు.
గుంతకల్లు కార్తీకమాసంను పురస్కరించుకుని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో భక్తులు విశేషంగా కార్తీక మాసోత్సవ దీపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారికి అత్యంత ప్రియమైన శనివారం అందులో కార్తీక మాసంను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి భక్తాదులు విరివిగా పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తమ తమ మ్రొక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారుల పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చొరవ చూపారు. ఇదిలా ఉండగా దేవాలయంకు చేరుకున్న భక్తాదులకు ప్రధానంగా జేబులకు చిల్లులుగా ఆలయ అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. శ్రీవారి దర్శనం కేవలం ధనార్జనే లక్ష్యంగా ఆలయ అధికారుల తీరుండడం, ఆలయ ప్రాంగణంలో ప్రతి చోట దోపిడీ విధానంగా పైసావసూల్ అన్న తీరుకు ప్రాధాన్యతగా ఉందని భక్తాదులు ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.
80 ప్యాకెట్ల బియ్యం తోపాటు బొలెరో వాహనం సీజ్…..
-ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
గుంతకల్లులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ను పలువురు అక్రమంగా ఇతర ప్రాంతాలకుతరలిస్తున్న వైనం లో అధికారుల అలసత్వం బహిర్గతంగా కావడం హేయం. గురువారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో గుంటకల్ పట్టణంలోని టీవీ స్టేషన్ దగ్గర కూడలి వద్ద టూ టౌన్ పోలీసు వారు వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో బొలెరో వాహనంలో దాదాపు 3600 కేజీలు గల 80 బస్తాలు రేషన్ బియ్యం గుత్తి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న గుత్తి ప్రాంతానికి చెందిన నాగ శేషు , హరి ప్రసాద్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సదరు సంఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి పట్టుబడిన బియ్యం ను అప్పగించారు.