Wednesday, July 30, 2025
spot_img
Home Blog Page 8

రాజ్యాంగమే భవిష్యత్ తరాలకు స్ఫూర్తి….

0

రాజ్యాంగమే భవిష్యత్ తరాలకు స్ఫూర్తి

నవంబర్ 26 : గుత్తి పట్టణంలోని సత్రంమిట్ట వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.
రాజ్యాంగ నిర్మాణంలో విశేషంగా కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవడం జరిగింది. రాజ్యాంగ ఆవిర్భావం జరిగి 74 సంవత్సరాలు జరిగినందువల్ల ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి టౌన్ మండల కన్వీనర్ లు హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, జిల్లా సీనియర్ నాయకులు మల్లయ్య యాదవ్, గురు ప్రసాద్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు వరదరాజులు, ఎన్ ఫారూఖ్, కేవి రమణ, నరేష్, నాయకులు జిప్పు రమణ, కలుగట్ల రాము, రమేష్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, అబ్దుల్, మలికార్జున, నాగరాజు, హమాలిరామంజి, డీలర్ పూలప్ప, బళ్లారి హరి నాథ్ రెడ్డి, గోపీ రెడ్డి, నాగరాజు, గాలిప్, హరి, పెద్ద పూలప్ప, ఎమ్మెల్యే వెంకట్రాముడు,
హరికృష్ణ, సోషల్ మీడియా చేనాజి, బేతప్పల్లి రాము, సురేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో ఇల్లు, భవనాలు నిర్మిస్తున్నారా..? కొత్త సంస్కరణలివే…

0

ఏపీలో ఇల్లు, భవనాలు నిర్మిస్తున్నారా..? కొత్త సంస్కరణలివే…

అమరావతి..

భ‌వ‌నాలు, లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో తీసుకోవాల్సిన సంస్కరణలో గతంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సోమవారం మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలోనే సంస్కరణలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. సమీక్షా సమావేశం తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ వివరాలను వెల్లడించారు.

నూతన సంస్కరణల ప్రకారం 15 మీటర్ల ఎత్తు వరకూ ఉన్న భవన నిర్మాణాల ప్లాన్‌లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదని మంత్రి నారాయణ తెలిపారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవన నిర్మాణాలకు సంబంధించి సదరు లైసెన్స్‌డ్ సర్వేయర్లు.. ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించి, రుసుం చెల్లిస్తే సరిపోతుందని.. అంతటితో అనుమతి వచ్చినట్టేనని మంత్రి నారాయణ తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో సమర్పించిన ప్లాన్‍ ప్రకారం కాకుండా నిర్మాణ సమయంలో మళ్లీ ఏవైనా అవకతవకలు జరిగితే సదరు సర్వేయర్ లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనితో పాటుగా ఆ సర్వేయర్ మీద క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. దీనివ‌ల్ల 95 శాతం మంది మున్సిప‌ల్ ఆఫీస్‌ల చుట్టూ తిరిగే అవ‌స‌రం ఉండ‌దని మంత్రి వివరించారు.

మరోవైపు లేఅవుట్లలో ప్లాన్ అప్రూవల్ కోసం గతంలో మాదిరిగా నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం తెస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అన్ని విభాగాల సర్వేయర్లను సమన్వయం చేసి మున్సిపల్ శాఖ ద్వారా అనుమతులు ఇస్తామన్న నారాయణ.. ఒకే పోర్టల్ ద్వారా ఫీజు చెల్లించి అనుమతులు పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు 31 నుంచి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలోనే కొత్త పాన్ కార్డులు.. పాతవన్నీ రద్దు.!

0

కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలోనే కొత్త పాన్ కార్డులు.. పాతవన్నీ రద్దు!

ఢిల్లీ..
కేంద్ర మంత్రివర్గం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.

ఇది QR కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA), ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

PAN 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
PAN 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరిత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం PAN/TAN సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీ-ఇంజనీరింగ్ చేయడానికి ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన.. విచారణ ముమ్మరం చేసిన సిట్‌..

0

తిరుమల .

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన.. విచారణ ముమ్మరం చేసిన సిట్‌..

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్‌ విచారణ సాగుతోంది. ఈమేరకు తిరుమలలో (Tirumala) రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్‌ ఏర్పాటుచేశారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ సాగుతోంది. మూడు బృందాలుగా ఏర్పడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు దిండిగల్‌ ఏఆర్‌ డెయిరీలో సిట్‌ బృందం సభ్యులు వివరాలు సేకరించారు. తిరుపతిలోని తితిదే (TTD News) మార్కెటింగ్‌ గోదాములను పరిశీలించారు. నెయ్యి కొనుగోలు టెండర్ల దస్త్రాలపై ఆరా తీశారు. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా సిట్‌ విచారణ సాగుతోంది..

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

0

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం.

నేషనల్ మిషన్‌ ఆఫ్ నేచురల్‌ ఫార్మింగ్‌కు ఆమోదం.

పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం.

పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డుల పంపిణీ.

క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పాన్‌ కార్డుల పంపిణీ.

పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ విధానంలో కొత్త పాన్‌కార్డు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్‌ కేంద్రానికి ఆమోదం.

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ 2.0కు కేబినెట్‌ ఆమోదం.

అటల్‌ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయించిన కేంద్రం.

ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం.

వన్‌ నేషన్‌-వన్‌ సబ్‌స్ర్కిప్షన్‌ పథకానికి ఆమోదం.

సబ్‌స్ర్కిప్షన్‌ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయింపు.

ఉమ్మడి అనంతపురం జిల్లా అహుడ చైర్మన్. టి.సి వరుణ్ ని కలిసిన గుమ్మనూరు నారాయణ, కూటమి శ్రేణులు…

0

ఉమ్మడి అనంతపురం జిల్లా అహుడ చైర్మన్. టి.సి వరుణ్ ని కలిసిన గుమ్మనూరు నారాయణ

నవంబర్ 25 :అనంతపురం.
గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు సోమవారం ఆయన సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ అనంతపురం పట్టణం నందు అహుడ చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీ.సి వరుణ్ ని కలిసి హృదయపూర్వక అభినందనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు…

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి…

0

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి

విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి

ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన

తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి

సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి

అమరావతి:-
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని… వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.

చట్ట ఉల్లంఘన పై ఎస్పీ ఉక్కుపాదం చర్యలు…

0

అనంతపురం :

గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు పేకాటకు సంబంధించి ఏడుగుర్ని అరెస్టు చేసి రూ. 59,350/- నగదు స్వాధీనం చేసుకున్నారు

జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు గడచిన 24 గంటలలో రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై 806 కేసులు నమోదు… రూ. 1,81,955/- లు ఫైన్స్ విధింపు

ఓపెన్ డ్రింకింగ్ పై 80 కేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పై 18 కేసులు నమోదు

అర్దరాత్రి వేళల్లో అనుమానాస్పందంగా సంచరిస్తున్న 129 మంది అపరిచితులను చెక్ చేసిన పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికకు షెడ్యూల్ ను అధికారులు సిద్ధం…

0

అమరావతి.

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికకు షెడ్యూల్ ను అధికారులు సిద్ధం

చేశారు.సాగునీటి సంఘాల ఎన్నికలకు కొత్త షెడ్యూలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికకు షెడ్యూల్ ను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు కొత్త షెడ్యూలును సిద్ధం చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతుండటంతో గతంలో అనుకున్న షెడ్యూలు వాయిదాపడింది. తాజాగా డిసెంబరు 5న ఉమ్మడి 13 జిల్లాల్లో సాగునీటి వినియోగదారుల సంఘాలకు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీని ప్రకారం డిసెంబరు 8న సాగునీటి సంఘాల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నిక, సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తవుతుంది. డిసెంబరు 11న జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారు. మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు కమిటీల ఛైర్మన్ల ఎన్నిక డిసెంబరు 14న ఉంటుంది.

రాష్ట్రంలో మొత్తం 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలు ఉండగా భారీ నీటి పారుదలలో 1,755 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 21,060 ప్రాదేశిక నియోజకవర్గాలు, మధ్యతరహాలో 266 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 3,192 ప్రాదేశిక నియోజవర్గాలు, చిన్ననీటి పారుదలలో 4,128 సాగునీటి వినియగదారుల సంఘాలు, 24,768 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు, వాటి కింద 71,11,712 ఎకరాల ఆయకట్టు వుంది. భారీ ప్రాజెక్టుల్లో 18 ప్రాజెక్టు కమిటీలు, మధ్య తరహాలో 35 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు డిసెంబరు 14 లోపు ఎన్నికలు పూర్తి కానున్నాయి.

సాగు చేస్తున్న పేదలకు న్యాయం చేయండి…సిపిఎం పార్టీ

0

సాగు చేస్తున్న పేదలకు న్యాయం చేయండి…
సిపిఎం పార్టీ
నవంబర్ 25 :కూడేరు.
అనంతపురం జిల్లా కూడేరు మండలం పరిధిలోని సర్వే నంబర్ 535 లోసాగు చేస్తున్న ప్రతి పేద రైతుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకుడు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశాడు. సోమవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయము ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద రైతులతో సంయుక్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ సర్వేనెంబర్ 535లో 40 సంవత్సరాలు నుండి సాగు చేసుకుంటున్నా చట్ట ప్రకారం లబ్ధిదారులగా గుర్తించి పత్రాలను అర్హత పత్రాలను అందజేయాలని డిమాండ్ చేశారు. కూడేరు, అరవకూరు , కడదర కుంట మొదలగు గ్రామాలకు చెందిన నిరుపేదలు సర్వేనెంబర్ 535లో గత 40 సంవత్సరాల క్రితం పెద్దపెద్ద కొండలు, గుట్టలను చదును చేసుకుని వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ది వివిధ పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు. కాగా నాటి నుండి పలుమార్లు అర్జీలతో రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విధులను నిర్వహిస్తున్న అధికారులను వేడుకున్నా వారి పట్ల న్యాయం కల్పించడంలో నిర్లక్ష్యం చేసిన తీరుండడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు చేస్తున్న బాధిత రైతులకు న్యాయం చేస్తూ వారికి 2013 భూ సేకరణ చట్టం అమలు ప్రకారం భూమి పట్టాలను అందజేసి న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులైన రైతుల సమీకరణతో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తదుపరి రైతుల పట్ల న్యాయం కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్. కరీంసాబ్, సహాయ కార్యదర్శి కే. వెంకటేశ్వర్లు నాయకులు, చిదంబరమ్మ, అలివేలమ్మ, శ్రీనివాసులు, రామాంజనేయులు ,గంగాధర, చౌడన్న, పరమేష్, అమ్మ దుర్గాదేవి తదితరులతో పాటు సాగుదారులు పాల్గొన్నారు.