Wednesday, July 30, 2025
spot_img
Home Blog Page 9

నిత్య అన్నదాన సేవకు ఓదాత ఒక లక్ష రూపాయలు దాతృత్వం…

0

నిత్య అన్నదాన సేవకు ఓదాత ఒక లక్ష రూపాయలు దాతృత్వం…
-ఒకరోజు నిత్య అన్నదాన సేవకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే రామగౌని వారి కుటుంబం దాతృత్వం..

నవంబర్ 25 :గుంతకల్లు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ బుగ్గ సంగమేశ్వర దేవస్థానమునకు నిత్య అన్నదాన సేవ నిమిత్తం పలువురు దాతలు తమ దాతృత్వంను చాటుకున్నారు. ఈశ్వరునికి అతి ప్రీతికర మాసం కార్తీక మాసంను పురస్కరించుకొని దేవస్థానం లోని శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి, శ్రీ పార్వతీదేవి వార్ల మూలవరులకు కార్యనిర్వహణాధికారి ఏ. కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం విశేషంగా పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణలు గావించి పూజలు నిర్వహించారు. సదరు పూజా కార్యక్రమాలకు వివిధ ప్రాంతంల నుండి భక్తులు విరివిగా పాల్గొని ఆలయ ప్రాంగణంలోని అశ్వర్థ వృక్షం వద్ద కార్తీకదీపాలను వెలిగించి తమ తమ మ్రొక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం పట్టణమునకు చెందిన మాల్కరి ఆనందరావు అనే విశ్రాంత ఉపాధ్యాయడు తన కుటుంబంతో విచ్చేసి నిత్య అన్నదానం సేవకు గాను లక్ష రూపాయలు విరాళంగా ఆలయ అధికారులకు అందజేసి తన దాతృత్వమును చాటుకున్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని దాతలకు శ్రీవారి ప్రసాదంగా శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి మూలవర్ల దర్శన భాగ్యం కల్పించి వేదమంత్రాలతో శ్రీవారి ఆశీర్వాదాలు అందజేసి అందజేశారు. అలాగే గుంతకల్లు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామగౌని జితేంద్ర గౌడ్ తోపాటు రామ గౌని సోదరుల కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకుని భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు వారి దాతృత్వమును అందజేసి తమ భక్తి ని చాటుకున్నారు.

విశేష పూజలు అందుకున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు…

0

విశేష పూజలు అందుకున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు…
-కార్తీక దీపాల వెలిగింపుతో మ్రొక్కులు తీర్చుకున్న భక్తాదులు..
-విశేష అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చిన మూలవర్లు.

నవంబర్ 25: గుంతకల్లు.
సుప్రసిద్ధ దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం నాలుగో సోమవారం భక్తజనులుతో విశేష పూజలతో అభిషేకాలతో శ్రీవార్ల మూరవర్లను దర్శించుకున్నారు. గుంతకల్లు మండలం సంఘాల గ్రామం సమీపంలో రాయల కాలం నాటి అతి పురాతన ఆలయంగా వెలసిన శ్రీ బుగ్గ సంగమేశ్వర దేవస్థానం ఒకటి ఇటీవల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ప్రత్యేక గుర్తింపును పొందిన దేవాలయం. శివునికి అతి ప్రీతికరమైన మాసంగా కార్తీకమాసం విశిష్టత ఉంది. భక్తులు కార్తీక మాసంలో శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహణతో కార్తీక దీపముల వెలిగించి తమ తమ మ్రొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలో కార్తీక మాసంను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులు భక్తీ ప్రవర్తలతో శ్రీ స్వామివారి దర్శనార్థం వేకువజామున నుండే తరలివస్తు స్వామివారి సేవలో పునీతులై తమ తమ మృక్కులను తీర్చుకున్నారు.

దళిత గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గుండ్లపల్లి శాంతిరాణి కి ఘనంగా సన్మానం …

0

దళిత గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గుండ్లపల్లి శాంతిరాణి కి ఘనంగా సన్మానం …

నవంబర్ 25 :గుంతకల్లు

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం, పట్టణానికి చెందిన సమాజ సేవకురాలు మరియు, అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అయినా గుండ్లపల్లి శాంతి రాణి విజయవాడలో జరిగిన అఖిల భారత దళిత గిరిజనుల బహుజన సంక్షేమ సంఘం ఆరవ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా సభకు హాజరు కావడం జరిగింది,ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఎనవల ఆంజనేయులు,శాంతిరాణిని ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో ఆమె చేస్తున్న సేవలు మరవలేనివని, అక్క అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ, ఉన్నదాంట్లోనే కొంచెం దానం చేస్తూ, మరి ముఖ్యంగా నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకురాలని,ఆమె చేసిన సోషల్ సర్వీసులను గుర్తించిన కొన్ని సంస్థలు ఆమెకు అవార్డు ప్రధానం చేయడం జరిగింది, మా సంస్థకు సమాజానికి ఆమె సేవలు, ఎల్లప్పుడు అవసరమని, అనునిత్యం న్యాయం కోసం పోరాడే, నాయకురాలు మన గుండ్లపల్లి శాంతిరాణి,అనితెలియజేశారుఅనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎనవల ఆంజనేయులు గారు, గుండ్లపల్లి శాంతిరాణి ఆది, దంపతులను, శాల్వా పూలమాలతో సంబంధించి, అవార్డు ప్రధానం చేశారు, అనంతరం శాంతిరాణి మాట్లాడుతూ, అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనదని, దాంట్లోనే సాటివారికి, సహాయపడుదాం, ఆపదలలో వున్నవారికి,మేము, మీకు అండగా ఉన్నామని ధైర్యాన్ని కలిపించండి, మరియు ఈ సభకు ఆహ్వానించి, సన్మానించిన, ఎనవల ఆంజనేయులు గారికి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో, రాష్ట్ర నలుమూలల నుంచి, నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ త్వరగాకొలుకోవాలని పూజలు..

0

మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ త్వరగాకొలుకోవాలని పూజలు..
నవంబర్ 25 :గుంతకల్లు

గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోగ్యము త్వరగా మెరుగయ్యి నియోజకవర్గానికి రావాలని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట వద్ద లక్ష్మీ వెంకటేశ్వర స్వామీ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ లో చికిత్స పూర్తయ్యి ఆరోగ్యంగా తిరిగిరావాలని పూజలు చేశారు.అలానే నియోజకవర్గంలో పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా వుండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామరంగారెడ్డి గోపాల్ రెడ్డి జ్ఞానేశ్వర్ ప్రహల్లాధ వేంకటేశ్వర్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం పట్టణ సీఐ గా యువరాజ్…

0

కళ్యాణదుర్గం పట్టణ సీఐ గా యువరాజ్..
నవంబర్ 25 :కళ్యాణదుర్గం.

కళ్యాణదుర్గం పట్టణ సీఐ గా యువరాజ్ బాధ్యతలు స్వీకరణ, కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని శెట్టూరు, కళ్యాణదుర్గం పట్టణ ఎస్సైగా గతంలో పనిచేశారు కళ్యాణదుర్గం ప్రజలకు సుపరిచితుడు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా కళాకారుల నృత్య పుష్పాంజలి…

0

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా కళాకారుల నృత్య పుష్పాంజలి…
నవంబర్ 24 గుంతకల్లు
గుంతకల్ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కళామందిరంలో ఆదివారం సాయంత్రం తిరుపతికి చెందిన శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళ నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో దేవాలయ అభివృద్ధి కమిటీ యాజమాన్యo వారి అధ్యక్షతన సాంస్కృతిక నృత్య కళాకారులు బళ్లారికి చెందిన కుమారి అవని గంగావతి, గుంతకల్లుకు చెందిన కుమారి బి హారిక ల సాంస్కృతిక నృత్యములచే శ్రీ స్వామివారి నృత్య పుష్పాంజలి కార్యక్రమం ఘనంగా జరిగింది. సదరు కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి భక్తి పాటలతో కళాకారులు వారి నృత్యములు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర భక్తమండలి అధ్యక్షుడు ఎం భాస్కర్ రంగయ్య, కార్యదర్శి నారాయణస్వామి, కోశాధికారి సుధాకర్ గుప్త లతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు జనార్దన్ స్వామి, కళాకారుల గురువులు శ్రీ కైవల్య కృతి సంగీత నృత్యాలయం కు చెందిన ఎస్కే పద్షా, శ్రీ లలిత కళ హిందుస్తానీ సంగీత నృత్య అకాడమీకి చెందిన ఆర్కే శ్రీనివాస్ , లక్ష్మీ డాన్స్ అకాడమీకు చెందిన పోతుకుంట విజయ్, ఏకే డ్యాన్స్ స్టూడియోకు చెందిన అశోక్ కుమార్ లతో పాటు విశ్రాంత తాసిల్దార్ గుంతకల్లు జిఎంవి చలపతి తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం…

0

కళ్యాణదుర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం…

— డివిజన్ కు సంబంధించి కళ్యాణదుర్గం ఆర్.డి.టి ఎకాలజీ సెంటర్ లో పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ…

-కళ్యాణదుర్గం డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, నవంబర్ 24 :

సోమవారం 25వ తేదీన కళ్యాణదుర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. కళ్యాణదుర్గం డివిజన్ కు సంబంధించి కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్.డి.టి ఎకాలజీ సెంటర్ లో ఈనెల 25వ తేదీన సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కళ్యాణదుర్గం డివిజన్ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.
అలాగే అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు.

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జయంతి…

0

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జయంతి..

నవంబర్ 24 :గుత్తి


గుత్తి పట్టణంలో ని శ్రీసాయి కళాశాలలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ
తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటంచేసి దేశం కోసం ఎన్నోపోరాటలు చెసి స్వతంత్ర సంగ్రామంలో రాయలసీమ యువతకి మార్గదర్శనం చేశారన్నారు.తన కొనఊపిరి వరకు దేశంకోసం పోరాటాలు చేసి చివరకు బ్రిటీషువాళ్ళ అక్రమ నిర్బంధం చేసి ఉరిశిక్ష విధించారు.కనుక ఇంతటి పొరతాయోధుడి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు జరిపి సెలవుదినంగా ప్రకటించాలన్నారు.త్వరలోనే నరసింహారెడ్డి విగ్రహాన్ని నెలకొలెపుతాం అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచనసమితి అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి.గూటికోట సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నాయకులు బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి నాయకులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఎర్రగుడిగోపాల్ రెడ్డి విరూపాక్ష రెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి రామరంగారెడ్డి హరినాథ్ రెడ్డి తురకపల్లి గోపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు

విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్..!

0

విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!

అమరావతి :

రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్ కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడం తో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్ కుఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 కు ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.

కే జీ వి జి ఎం ఆధ్వర్యంలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం…

0

కే జీ వి జి ఎం ఆధ్వర్యంలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం..
నవంబర్ 23 గుంతకల్లు

పట్టణంలో ఉన్నటువంటి హోటల్స్ బేకరీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చికెన్ సెంటర్స్ టీ స్టాల్స్ వ్యాపారులకు పాత గుంతకల్ లో ఉన్నటువంటి శ్రీ వాల్మీకి మహర్షి కళ్యాణమండపం నందు ఆహార భద్రత గురించి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ట్రైనర్ యశోద గారు ఆహార భద్రతపై శిక్షణ ఇవ్వడం జరిగినది .ఆహార విక్రయిత నిర్వాహకులకు అవగాహన కలిగిస్తూ నేటి సమాజంలో ప్రతి ఒక్క తినుబండారాలలో కల్తీ రావడం జరుగుతుంది కనుక ప్రజలకు మీరు సరైన శుభ్రత పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఆహార భద్రత పాటిస్తూ తయారుచేసినటువంటి వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని అవగాహన లేకుండా నిర్వహించి ప్రజల ఆరోగ్యాలపై సరైన తిరుబండారాలు విక్రయించేలాగా చూడాలని కోరారు అలాగే వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తో పాటు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికెట్ పాటు ఫాస్ట్ ట్రాక్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలని తెలియజేశారు ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్స్ జ్యోతి మరియు జింకల వేణుగోపాల్ వాల్మీకి అరుణకుమారి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.