Wednesday, July 30, 2025
spot_img
Home Blog Page 7

కర్నూల్ DPO కార్యాలయ ఆవరణంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం …

0

కర్నూల్ DPO కార్యాలయ ఆవరణంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం …
నవంబర్ 27: కర్నూలు.

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం కార్తీక మాస వన భోజన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు పరిపాలన శాఖ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో కార్తీక మాస వన భోజన మహోత్సవాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హాజరై (ధాత్రి నారాయణ) అమలకి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం ఆయనతోపాటు పోలీసు మినిస్టీరియల్ సిబ్బంది అంతా ధాత్రి నారాయణ చెట్టు కింద వనభోజనం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ధాత్రీ నారాయణ చెట్టు కింద భోజనం చేయడం మంచిదని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో జరుపుకొని సంతోషంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏడీఎంఎన్) హుస్సేన్ పీరా, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీలో నేడు డిఎస్సి సిలబస్ విడుదల …

0

ఏపీలో నేడు డిఎస్సి సిలబస్ విడుదల

అమరావతి.

apdsc2024.apcfss.in వెబ్సైట్లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి సిలబస్ బుధవారం విడుదల కానుంది.

త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్ ను బుధవారం విడుదల చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుకల్పిస్తూ సిలబస్ విడుదల చేస్తున్నామని వెల్లడించారు

బుధవారం అనంతపురం కు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కోనా శశిధర్ రాక..

0

27-11-2024 బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రాక ..
నవంబర్ 26 :అనంతపురం.
ఏపి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కోన శశిధర్ బుధవారం జిల్లాకు వస్తున్నట్లు డీఈఓ ఎం.ప్రసాద్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉమ్మడి జిల్లా లో రెండు రోజులు పర్యటిస్తారని, అయితే ఎటు నుంచి వస్తారో, ఏ స్కూల్ కి వెళ్తారో తెలియదన్నారు. ప్రిన్సిపాల్ సెక్రెటరీ రెండు జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. అందువలన అన్ని మండలాల ఎంఈఓ లు మండలానికి సంబంధించిన విద్య సమాచారాన్ని అందుబాటులో పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ వీసీ ద్వారా ఆదేశాలు జారీ చేశారన్నారు.

పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిశిత పరిశీలనతో పరిష్కరించాలి …జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి.

0

పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిశిత పరిశీలనతో పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి

నవంబర్ 26 : పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిశిత పరిశీలనతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అమలు తీరుపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో మంగళవారం వీక్షణ సమావేశం ద్వారా కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన అర్జీలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గడువు దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మార్టూరు, బాపట్ల మండలాలలో పెండింగ్ లో ఉన్న అర్జీలపై ఆరా తీశారు. జాప్యంపై వివిధ మండలాల అధికారులను నిలదీశారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు నాణ్యతతో సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. నీటి తీరువా పన్ను వసూలు లక్ష్యం మేరకు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల రెవిన్యూ డివిజన్ పరిధిలో రూ.3.40 కోట్లు బకాయిలు ఉండగా, చీరాల డివిజన్ లో రూ.5.24 కోట్లు, రేపల్లె డివిజన్లో రూ.4.83 కోట్లు బకాయలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.13.47 కోట్లు బకాయిలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వి ఆర్ ఓ లకు లక్ష్యాలు నిర్దేశించి వసూలు చేయాలన్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు పి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై సచివాలయాల సిబ్బందితో కలెక్టర్ సమావేశం…

0

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై సచివాలయాల సిబ్బందితో కలెక్టర్ సమావేశం… నవంబర్ 26 బాపట్ల.

నవంబర్ 26 : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రుల కమిటీలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై సచివాలయాల సిబ్బందితో మంగళవారం స్థానిక పురపాలక సంఘం సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. విద్యార్థుల జీవితాలు మెరుగుపడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారన్నారు. విద్యార్థుల గృహాలకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఘనంగా ఆహ్వానించాలన్నారు. సమావేశం ప్రాధాన్యతను వివరించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మార్చే సమావేశాల ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు, నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రతి కుటుంబ సభ్యుడు హాజరు కావాలి…

0

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు, నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రతి కుటుంబ సభ్యుడు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చేన్నపాటి శ్రీకాంత్.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాజాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకను ది 10-12-2024 వ తేదిన జాతీయస్థాయి సభ్యులు, దక్షిణ భారతస్థాయి,రాష్ట్రస్థాయి సభ్యులు, జిల్లాస్థాయి సభ్యులు అందరూ పాల్గొని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించాలని నా మనవి*
ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో చేయాలి అని జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ,జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాల సభ్యులు మొత్తం ఒకేచోట అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకునేలా ప్రయత్నం చేయటం జరిగింది

వేదిక:- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగినది

అదే రోజు రాజమండ్రిలో దక్షిణ భారతదేశం, రాష్ట్రస్థాయి లో ఉన్నటువంటి మహిళా కుటుంబ సభ్యులు దక్షిణ భారతదేశ మహిళా విభాగ కన్వీనర్ మరియు తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగ అధ్యక్షుల కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది

కావున అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన హెచ్ ఆర్ సి ఐ కుటుంబ సభ్యులందరూ కూడా నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాము

గమనిక:- ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు తప్పకుండా హాజరవ్వాలని నా మనవి

నూతనంగా సంస్థలో సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఐ డి కార్డులు ఇవ్వటం జరుగుతుంది

మీ
నందం నరసింహారావు
జాతీయ ప్రధాన కార్యదర్శి
9533644555

రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి…

0

రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి..

నవంబర్ 26 : బాపట్ల

వెనుకబడిన సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయాలలో సమానత్వానికి ప్రజాస్వామ్యం సంరక్షణగా నిలిచిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. పిజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధశాఖల జిల్లా అధికారులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. దేశంలోని భిన్న కులాలు, మతాలు, రాజకీయ అసమానతలను తొలగించి ఐక్యతతో జీవించడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. భారతదేశంలో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందన్నారు. విదేశీయులకు సైతం స్వేచ్ఛగా మన దేశంలో జీవించటానికి అవకాశాలు ఇచ్చిందన్నారు. హక్కులు ఉల్లంఘన జరిగితే వాటిని సాధించుకునే అవకాశం రాజ్యాంగ కల్పించిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేశానికి ప్రభుత్వ వ్యవస్థ శరీరం లాంటిది అయితే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ఆయన వర్ణించారు. అనగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కొరకు ఎస్టి ఎస్సి, బిసి, మహిళా, హిజ్రాలకు కమిషన్ లు సమర్ధంగా పనిచేస్తున్నాయన్నారు. అంటరానితనం నిర్మూలనకు రాజ్యాంగం ఓ గొప్ప ఆయుధంలా నిలిచిందన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వారిగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని భారత దేశం అభివృద్ధి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. విద్యాతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. రాజ్యాంగం స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరైనా ఏ చట్టాలు తెచ్చినా వాటిని కొట్టివేసేలా సుప్రీంకోర్టు వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు. ప్రజలు సుభిక్షంగా జీవించడానికి రాజ్యాంగం అనేక హక్కులు కల్పించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం అనేక చట్టాలను రూపొందించిన విషయాలను ఆయన వివరించారు. రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానంగా ఎదగడానికి రాజ్యాంగం వేదికగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డిఓ పి గ్లోరియా, జిల్లా అధికారులు, ఎస్సీ సంఘం నాయకులు, చారువాక, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

మూడో విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… గుమ్మనూరు జయరాం…

0

*మూడో విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… గుమ్మనూరు జయరాం
నవంబర్ 26 :గుంతకల్లు

గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి ,గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి ఇంచార్జ్ గుమ్మనూర్ ఈశ్వర్ , గుమ్మనూరు నారాయణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మూడో విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గుంతకల్లు నియోజకవర్గం మూడు మండలాల లబ్ధిదారులకు అందించడం జరిగింది.ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ అనారోగ్యం రీత్యా ఎంతోమంది తమ సొంత నిధులతో ఖర్చు పెట్టుకుని హాస్పిటల్లో చూపించుకుని తర్వాత తమ దగ్గరికి వచ్చి తమ సమస్యను తనతో చెప్పారని ఈ సమస్య ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి కి సమస్యను వివరించడం జరిగిందని స్పందించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గుంతకల్లు నియోజకవర్గం కు నాలుగు లక్షల 85 వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అని తెలిపారు తాను ఎల్లవేళలా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలాఅండగా ఉంటానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

అభివృద్ధి భారతదేశానికి నాంది రాజ్యాంగ పీఠిక…

0

అభివృద్ధి భారతదేశానికి నాంది రాజ్యాంగ పీఠిక…

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ

నవంబర్ 26 : 75వ “భారత రాజ్యంగ దినోత్సవ” సందర్భంగా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణం ఎదుట ఉన్న డాబిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా డా.బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలుతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలో “భారత ప్రజలమైన మేము” అనే పదాలతో మొదలయ్యే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం, ఈ రోజు (నవంబర్ 26) న చట్ట సభల్లో అమోదించబడిన సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగంలోని అంశాల సారాంశాన్ని, రాజ్యాంగ రూపకర్తల ఆశయాల సాధనకై మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ మహామనుషుల అడుగుజాడల్లో నిడిచి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక న్యాయాన్ని, మహిళా సాధికారకతను, లింగ సమానత్వాన్ని, సంక్షేమం – అభివృద్ది, గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రాన్ని నడిపించారని, ప్రస్తుతం రాజ్యాంగ విలువలు సమాజంలో సన్నగిల్లుతున్నాయని, ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటూ, రాజ్యంగా స్పూర్తిని కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురము నగర పాలక సంస్థ మేయరు, డిప్యూటి మేయర్లు, కార్పొరేటర్లు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుని బాధ్యత…

0

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుని బాధ్యత

నవంబర్ 26 : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామం నందు నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు టౌన్ కార్యదర్శి శ్రీనివాసులు, కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షులు జగ్గిల రమేష్, సంచారజాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసులు, రాయలసీమ దళిత సంఘం అధ్యక్షులు తగరం రామాంజనేయులు, గ్రామీణ పౌర సేవ సమితి నాయకులు అధ్యక్షులు లాల్ రెడ్డి, అనిల్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ మాదిగ, పౌర హక్కుల సంఘం గుంతకల్ ఇన్చార్జి వి ఆదినారాయణ, ఎంఆర్పిఎస్ మండల నాయకులు జయరాం మాదిగ, పక్కిరప్ప మాదిగ, రమేష్ మాదిగ, వెంకట రాముడు మాదిగ, పుల్లన్న మాదిగ, రజక సంఘం నాయకులు హనుమంతు, ఆంజనేయులు, ప్రజాస్వామ్యవాదులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, భారత దేశానికి దశ దిశ నిర్దేశించిన మార్గదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రచించి భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, రచన కాలం రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందన్నారు. భారతీయులందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా కసాపురం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామిదాస్ మాదిగ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం నాయకులు గుంతకల్ టౌన్ కార్యదర్శి సంచి శ్రీనివాసులు, డివిజన్ కార్యదర్శి కెవిపిఎస్ నాయకులు జగ్గిల్ రమేష్, పౌరహక్కుల సంఘం గుంతకల్ ఇన్చార్జి వి ఆదినారాయణ, గ్రామీణ సేవా సమితి అధ్యక్షులు లాల్ రెడ్డి, అనిల్, ఎంఆర్పిఎస్ గుంతకల్ మండల నాయకులు జయరాం మాదిగ, పకీరప్ప మాదిగ, గ్రామీణ కార్యకర్తలు వెంకట రాముడు మాదిగ, రమేష్ మాదిగ, కాశీనాథ్ మాదిగ, రజక సంఘం నాయకులు హనుమంతు, ఆంజనేయులు, పుల్లన్న, రామాంజనేయులు, మల్లప్ప, వెంకటేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.