Wednesday, July 30, 2025
spot_img
Home Blog Page 12

ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కు సహకరించండి… వన్ టౌన్ సిఐ మనోహర్.

0

వ్యాపారులారా ..
ట్రాఫిక్ సమస్య నివారణకై సహకరించండి…
వన్ టౌన్ సీఐ మనోహర్.

నవంబర్ 17 :గుంతకల్లు

పట్టణంలో వివిధ వ్యాపారాల యాజమాన్యులు ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని వన్ టౌన్ సీఐ మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ హోల్సేల్ ,రిటైల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై వారితో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వులతో స్థానిక డిఎస్పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధాన రహదారులలో మీ గా వంతుగా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రభుత్వ చట్టపరమైన విధి విధానాలను పాటిస్తూ సహకరించాలని ఆదేశించారు . పట్టణంలో పలు వ్యాపారాలతో ఆయా సరుకుల రవాణాలో భాగంగా వివిధ వాహనాల లోడింగ్ ,అన్లోడింగ్ విషయంలో భాగంగా రాత్రి సమయాల్లోనే ఆయా విధులు చేపట్టాలన్నారు. పగటిపూట ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని సూచించారు. వ్యాపారాలుగా ఆదాయం ఒక్కటే అనుకోకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ట్రాఫిక్ నిబంధనలను పాటింపుకు సహకరించాలన్నారు . ఆయా దుకాణాల ముందు రోడ్డు కనపడేలా సీసీ ల కెమెరాలను అమర్చుకుని చోరీలు, వివిధ అసాంఘిక కార్యకలాపాల చర్యల నివారణకు తమ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కు సహకరించండి… వన్ టౌన్ సిఐ మనోహర్.

0

వ్యాపారులారా ..
ట్రాఫిక్ సమస్య నివారణకై సహకరించండి…
వన్ టౌన్ సీఐ మనోహర్.

నవంబర్ 17 :గుంతకల్లు

పట్టణంలో వివిధ వ్యాపారాల యాజమాన్యులు ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని వన్ టౌన్ సీఐ మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ హోల్సేల్ ,రిటైల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై వారితో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వులతో స్థానిక డిఎస్పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధాన రహదారులలో మీ గా వంతుగా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రభుత్వ చట్టపరమైన విధి విధానాలను పాటిస్తూ సహకరించాలని ఆదేశించారు . పట్టణంలో పలు వ్యాపారాలతో ఆయా సరుకుల రవాణాలో భాగంగా వివిధ వాహనాల లోడింగ్ ,అన్లోడింగ్ విషయంలో భాగంగా రాత్రి సమయాల్లోనే ఆయా విధులు చేపట్టాలన్నారు. పగటిపూట ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని సూచించారు. వ్యాపారాలుగా ఆదాయం ఒక్కటే అనుకోకుండా ఆమోదయోగంగా ట్రాఫిక్ నిబంధనలను పాటింపు కు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఆయా దుకాణాల ముందు రోడ్డు కనపడేలా సీసీ కెమెరాలను అమర్చుకుని చోరీలు, వివిధ అసాంఘిక చర్యల నివారణకు తమ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు..

శ్రీశైల గిరులు.. పర్యాటక సిరులు..!!

0

శ్రీశైల గిరులు.. పర్యాటక సిరులు..!!

నవంబర్ 17: శ్రీశైలం.

రుద్రా పార్కు నుంచి నల్లమల కొండల నడుమ శ్రీశైలం జలాశయం అందాలు .

కృష్ణమ్మను అందెలుగా పెట్టుకొని.. అభయారణ్యాన్ని కట్టుకొని.. శిఖర సిగన మల్లన్న కోవెలను ధరించిన మనోహర ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం.
దీన్ని పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేయాలని రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నల్లమల కొండల్లో వయ్యారాలు పోయే కృష్ణా నది సౌందర్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపేలా ఇటీవలే సీ ప్లేన్‌నూ ప్రారంభించింది. దీంట్లో విజయవాడ నుంచి వెళ్తే అరగంటలోనే శ్రీశైలం చేరుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలతో రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రప్రభుత్వం పర్యాటకంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే స్థానిక రుద్రా పార్కును ఆహ్లాదంగా తీర్చిదిద్దింది. వివిధ బొమ్మలను ఏర్పాటుచేసింది.శ్రీశైలంలోని రుద్రా పార్కులో ఎడ్ల బండి బొమ్మ వద్ద పర్యాటకులు

ప్రతిపక్షం లేని కొరత తీరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు…

0

ప్రతిపక్షం లేని కొరత తీరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు…

ప్రతిపక్షం వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మామూలే కానీ అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఘాటుగా ప్రశ్నిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటివి ఏపీ అసెంబ్లీలో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వైసీపీ ఎలాగూ సభకు రావడం లేదు.అందుకే ఆ పాత్ర కూడా తామే తీసుకుంటున్నారు. జ్యోతుల నెహ్రూతో పాటు కూన రవికుమార్ రెండురోజుల పాటు సభలో అలజడి రేపారు. దీంతో మంత్రులు, స్పీకర్ జోక్యం చేసుకోవాల్సిన వచ్చింది.

క‌్వశ్చన్ అవర్ జరుగుతున్న సమయంలో కూన రవికుమార్.. సభ డ్రైవర్ లేని బస్సులా సాగుతోందని అనేశారు. ఎందుకంటే సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలను ఎవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. దాంతో అచ్చెన్నాయుడు వెంటనే కల్పించుకున్నారు. రవికుమార్ఎక్కడో చివరి వరుసలో కూర్చోవడం వల్ల తెలియడం లేదని మంత్రులు రాసుకుటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అంతకు ముందు రోజు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఇంతే మాట్లాడారు. ఉచిత ఇసుక విధానంపై విమర్శలు చేశారు. అంతా చేసి తనను ప్రతిపక్షం అనుకోవద్దని..అన్నారు.

ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉండటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. వారికి పదవులు సర్దుబాటు చేయడం కష్టం అవుతుంది. కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ వంటి వాళ్లు మంత్రి పదవుల్ని ఆశించారు. వారి సీనియార్టీకి, పడిన కష్టానికి ఇవ్వాలి కూడా. కానీ సమీకరణాలు కలసి రాలేదు. దాంతో వారు అసంతృప్తికి గురవుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో చేయడం వల్ల.. ప్రతిపక్షం లేని కొరత కూడా తీరుతున్నట్లుగా అవుతోంది.

ప్రతిపక్షం లేని కొరత తీరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు…

0

ప్రతిపక్షం లేని కొరత తీరుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు…

అమరావతి:: నవంబర్ 17

ప్రతిపక్షం వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మామూలే కానీ అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఘాటుగా ప్రశ్నిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటివి ఏపీ అసెంబ్లీలో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వైసీపీ ఎలాగూ సభకు రావడం లేదు.అందుకే ఆ పాత్ర కూడా తామే తీసుకుంటున్నారు. జ్యోతుల నెహ్రూతో పాటు కూన రవికుమార్ రెండురోజుల పాటు సభలో అలజడి రేపారు. దీంతో మంత్రులు, స్పీకర్ జోక్యం చేసుకోవాల్సిన వచ్చింది.క‌్వశ్చన్ అవర్ జరుగుతున్న సమయంలో కూన రవికుమార్.. సభ డ్రైవర్ లేని బస్సులా సాగుతోందని అనేశారు. ఎందుకంటే సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలను ఎవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. దాంతో అచ్చెన్నాయుడు వెంటనే కల్పించుకున్నారు. రవికుమార్ఎక్కడో చివరి వరుసలో కూర్చోవడం వల్ల తెలియడం లేదని మంత్రులు రాసుకుటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అంతకు ముందు రోజు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఇంతే మాట్లాడారు. ఉచిత ఇసుక విధానంపై విమర్శలు చేశారు. అంతా చేసి తనను ప్రతిపక్షం అనుకోవద్దని..అన్నారు.ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉండటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. వారికి పదవులు సర్దుబాటు చేయడం కష్టం అవుతుంది. కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ వంటి వాళ్లు మంత్రి పదవుల్ని ఆశించారు. వారి సీనియార్టీకి, పడిన కష్టానికి ఇవ్వాలి కూడా. కానీ సమీకరణాలు కలసి రాలేదు. దాంతో వారు అసంతృప్తికి గురవుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో చేయడం వల్ల.. ప్రతిపక్షం లేని కొరత కూడా తీరుతున్నట్లుగా అవుతోంది.

సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆకర్షణీయమైన కొత్త పథకం అమిత్ యాదవ్…!

0

సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆకర్షణీయమైన కొత్త పథకం అమిత్ యాదవ్…!

–70 ఏళ్లు పైబడిన వృద్ధులకు అండగా కేంద్రం మరో కొత్త విధానం

ఆదాయంతో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజీ అందించేలా స్కీమ్ రూపకల్పనఇప్పటికే పూర్తయిన సంపద్రింపులు.

వెల్లడించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్

వయసు పైబడి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే సీనియర్ సిటిజన్లకు అండగా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే నూతన విధానాన్ని తీసుకురానుందని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ విధానంపై ఇప్పటికే సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా (ఏఎస్‌ఎల్‌ఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ యాదవ్ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే ఆచరణలో ఉన్న ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ మాదిరిగా కాకుండా కొత్త విధానంలో ఆదాయ పరిమితితో సంబంధం ఉండబోదని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించిందని అమిత్ యాదవ్ వివరించారు.
కాగా భారతదేశంలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా 30 కోట్లు దాటవచ్చని ఏఎస్ఎల్ఏ చైర్మన్, అంటారా సీనియర్ కేర్ ఎండీ, సీఈవో రజిత్ మెహతా అంచనా వేశారు. మొత్తం జనాభాలో 20 శాతంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందుకే సీనియర్ సిటిజన్ల భద్రతకు సమగ్ర పరిష్కారాలు చూపించాలనే డిమాండ్లు ఉన్నాయని ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలోని వృద్ధుల్లో కేవలం 5 శాతం మందికి మాత్రమే సంస్థాగత వైద్య సంరక్షణ సదుపాయం అందుబాటులో ఉందని, సగం మందికి పైగా వృద్ధులు సామాజిక భద్రత లేకుండానే జీవిస్తున్నారని రజిత్ మెహతా పేర్కొన్నారు.
ఇక వృద్ధుల ఆరోగ్య సంరక్షణ సేవలలో వసతుల్లో కూడా గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. — ప్రతి 1,000 మంది వృద్ధులకు 0.7 శాతం కంటే తక్కువ హాస్పిటల్ బెడ్‌లు ఉన్నాయని రజిత్ మెహతా పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే స్థిరమైన సీనియర్ సిటిజన్ల భద్రతా విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. వృద్దుల క్షేమం, హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టాలని రజిత్ మెహతా సూచించారు. భద్రత, సౌకర్యాలు, సామూహిక మద్దతుకు ప్రాధాన్యత ఇచ్చే హౌసింగ్ సొల్యూషన్స్‌ చూపించాలని రజిత మెహతా పేర్కొన్నారు.

ఆపార్ జనరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్..

0

అపార్ జనరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

— జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్…

నవంబర్ 16 : అనంతపురం

అపార్ జనరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఈఓ, డివిఈవో, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షనిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు 10 వేల నుంచి 15 వేల వరకు అపార్ జనరేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ జనరేషన్ లో అన్ని జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో వేగంగా ప్రక్రియ జరిగేందుకు ప్రిన్సిపాల్, హెడ్మాస్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. అపార్ జనరేషన్ లో లేట్ బర్త్ సర్టిఫికెట్ సమస్యకు సంబంధించి నెలకొన్న సందేహాలపై డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని డిఎల్డిఓలకు సూచించారు. వచ్చే మంగళవారం అనంతపురం డివిజన్ పరిధిలో, బుధవారం కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో, గురువారం గుంతకల్లు డివిజన్ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అపార్ జనరేషన్ లో స్పష్టత, ఖచ్చితత్వం ముఖ్యమైనదన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఆధార్ అప్లోడ్ చేసి అపార్ అప్డేట్ చేయాలని, ఈ విషయమైప్రత్యేక దృష్టిసారించాలనిఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఈఓ ప్రసాద్ బాబు, డిపిఓ నాగరాజునాయుడు, డివిఈఓ వెంకటరమణ నాయక్, ఆధార్ నోడల్ అధికారి నారపరెడ్డి, ఏపీఎం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు మండల నూతన కమిటీ ఎన్నిక…

0

ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు మండల నూతన కమిటీ ఎన్నిక…

నవంబర్ 16: గుంతకల్లు

ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీయూడబ్ల్యూజే ) ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవిన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జగదీష్ జిల్లా కార్యదర్శి చౌడప్ప ఆధ్వర్యంలో ఈద్గా ఫంక్షన్ హాల్ లో జాతీయ పత్రిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు నియోజకవర్గం కార్యదర్శి జిఎం మహమ్మద్ రఫీ అధ్యక్షతన వహించారు.అనంతరం ఏపీయూడబ్ల్యూజే గుంతకల్లు మండల నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు.ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా శేశగిరి స్వామి,మండల ప్రధాన కార్యదర్శిగా బోయ వెంకటరాముడు,కోశాదికారి రమేష్ రావు,గౌరవ అధ్యక్షులుగా హరిగోపాల్
ఉపాధ్యక్షులుగా శశిధర్,సహాయ కార్యదర్శిగా తలారి ఆనంద్ , కార్యవర్గ సభ్యులుగా గోరేంట్ల నాగరాజు,అక్బర్ లను ఎన్నుకున్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షుడిగా జి.శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శిగా శివారెడ్డి, కోశాధికారిగా చంద్రశేఖర్ ,గౌరవ అధ్యక్షులుగా ఏవీవి ప్రసాద్ ,ఉపాధ్యక్షులుగా అలీ భాష, సిద్ధిక్ ,సహాయ కార్యదర్శులుగా మహమ్మద్ రఫీ లను ఎన్నుకున్నారు.

శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జ్వాలాతోరణం ఉత్సవం.–ఆలయ అధికారుల విధుల్లో అలసత్వమా.. లేక నిర్లక్ష్యమా..?

0

శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జ్వాల తోరణం ఉత్సవం…
-ఉత్సవం నిర్వహణలో అధికారుల తీరులో అలసత్వమా.. లేక నిర్లక్ష్యమా….?
నవంబర్ 15 :గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారికి”జ్వాలా తోరణం ఉత్సవం” కార్యక్రమం జరిగింది. సదర్ కార్యక్రమంలో భాగంగా ఆలయ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ అర్చక బృందం ల సమన్వయంతో జరిగిన జ్వాల తోరణ మహోత్సవం పలు ప్రమాద సంఘటనలకు తావిస్తున్న తీరు ఉండడం గమనార్హం. జ్వాలా తోరణ ఉత్సవంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కే సుగుణమ్మ, ఆలయ ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు కార్యక్రమంను ప్రారంభించారు. సదరు కార్యక్రమంలో జ్వాలా తోరణం ను వెలిగించి తదుపరి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాల ను ఓ పల్లకిపై ఉపస్తించి ఆలయ ప్రాకారోత్సవం ప్రారంభించారు. ఈ క్రమంలో జ్వాలాతోరణం క్రింది భాగం నుండి ప్రాకారం గా భక్తాదులతో పాటు వేద పాఠశాల చిన్నారులు, ఆలయ అధికారులు, అర్చక బృందం తదితరులు తరలి వస్తున్న నేపథ్యంలో ఓ జ్వాలతో కూడిన తోరణం క్రింద పడిన సంఘటన చోటుచేసుకుంది. కాగా ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం శ్రీవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉందనడానికి తార్కానంగా పేర్కొనవచ్చు. సదరు కార్యక్రమం నిర్వహణలో ప్రమాద రహితంగా బాధ్యతల విస్మరింపు తీరుగా దేవస్థానం అధికారులు తమ తమ విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుందని స్థానికంగా భక్తాదులు విమర్శించడం విశేషం. అలాగే ఇటీవల గత కొంతకాలంగా దేవస్థానం ప్రధాన అధికారులు గైర్హాజరు తీరులో కార్యక్రమాల నిర్వహణ జరుగుతుండడం శోచనీయం. సదరు విశేష కరమైన కార్యక్రమాలలో ఏదేని ప్రమాదములు చోటు చేసుకుంటే బాధ్యులుగా ఎవరు అని స్థానికంగా భక్తులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జ్వాలా తోరణం ఉత్సవం. దేవస్థానం అధికారుల విధులలో అలసత్వమా.. లేక నిర్లక్ష్యమా..?

0

శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జ్వాల తోరణం ఉత్సవం…
-ఉత్సవం నిర్వహణలో అధికారుల తీరులో అలసత్వమా.. లేక నిర్లక్ష్యమా….?
నవంబర్ 15 :గుంతకల్లు.


ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారికి”జ్వాలా తోరణం ఉత్సవం” కార్యక్రమం జరిగింది. సదర్ కార్యక్రమంలో భాగంగా ఆలయ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ అర్చక బృందం ల సమన్వయంతో జరిగిన జ్వాల తోరణ మహోత్సవం పలు ప్రమాద సంఘటనలకు తావిస్తున్న తీరు ఉండడం గమనార్హం. జ్వాలా తోరణ ఉత్సవంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కే సుగుణమ్మ, ఆలయ ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు కార్యక్రమంను ప్రారంభించారు. సదరు కార్యక్రమంలో జ్వాలా తోరణం ను వెలిగించి తదుపరి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాల ను ఓ పల్లకిపై ఉపస్తించి ఆలయ ప్రాకారోత్సవం ప్రారంభించారు. ఈ క్రమంలో జ్వాలాతోరణం క్రింది భాగం నుండి ప్రాకారం గా భక్తాదులతో పాటు వేద పాఠశాల చిన్నారులు, ఆలయ అధికారులు, అర్చక బృందం తదితరులు తరలి వస్తున్న నేపథ్యంలో ఓ జ్వాలతో కూడిన తోరణం క్రింద పడిన సంఘటన చోటుచేసుకుంది. కాగా ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం శ్రీవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉందనడానికి తార్కానంగా పేర్కొనవచ్చు. సదరు కార్యక్రమం నిర్వహణలో ప్రమాద రహితంగా బాధ్యతల విస్మరింపు తీరుగా దేవస్థానం అధికారులు తమ తమ విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుందని స్థానికంగా భక్తాదులు విమర్శించడం విశేషం. అలాగే ఇటీవల గత కొంతకాలంగా దేవస్థానం ప్రధాన అధికారులు గైర్హాజరు తీరులో కార్యక్రమాల నిర్వహణ జరుగుతుండడం శోచనీయం. సదరు విశేష కరమైన కార్యక్రమాలలో ఏదేని ప్రమాదములు చోటు చేసుకుంటే బాధ్యులుగా ఎవరు అని స్థానికంగా భక్తులు ప్రశ్నిస్తున్నారు.