నవంబర్14: అనంతపురం
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర
- జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS దంపతులు వెల్లడి
- జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా బాలల దినోత్సవం
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS దంపతులు అభిప్రాయాన్ని వెల్లడించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులోరక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల నడుమ ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ గారితో పాటు ఆయన సతీమణి శ్రీమతి హేమ జగదీష్ IPS గారు పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఎస్పీ దంపతులు మాట్లాడాతు చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల భవిష్యత్తు నిర్ధేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమన్నారు కుటుంబ అభివృద్ధి, శ్రేయస్సు, భద్రత చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఉంది. రాబోవు విద్యాసంవత్సరంలో ఫస్ట్ క్లాస్ పోలీసు పిల్లలు ఉన్నారు చదువుకునేలా అనుమతుల కోసం దరఖాస్తు చేశాము. అంతేకాకుండా… స్పానిష్ టీచర్ కోసం కూడా ఆర్డీటీ వారికి లెటర్ పెట్టాము. పిల్లలకు చదువుతో పాటు ఆటలు, డ్యాన్స్ , ఇతర అభివృద్ధికి కృషి చేస్తామని పిలుపునిచ్చారు. అనంతరం ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలకు బిస్కెట్స్, పెన్నులు, తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా పిల్లలు పాటలు, నృత్యాలు, వేమన పద్యాలులో తమ తమ ప్రతిభను చాటారు. అలాగే ఓ మెజీషియన్ ఇచ్చిన ప్రదర్శన పిల్లల్ని సంతోషపరిచింది.
ఆకట్టుకున్న రోడ్డు భద్రతా నియమాల పాటింపుపై ప్రదర్శన…
రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలు బృందంగా ఏర్పడి రోడ్డు ప్రమాదాల నియంత్రణ… రోడ్డు భద్రతా నియమాల పాటింపుపై చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. వాహన చోదకులు, పాదాచారులు ఎలాంటి నియమాలు పాటించాలో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.
రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల కోసం సిద్ధం చేసిన గదిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సతీమణి
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల కోసం సిద్ధం చేసిన గదిని జిల్లా ఎస్పీ దంపతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న తరగతి గదులతో పాటు అదనంగా పునరుద్ధరించిన ఈ గదిని చిన్నారుల కోసం వినియోగించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఇలియాజ్ బాషా ( ఏ.ఆర్ ), సి.ఐ లు ధరణీ కిశోర్, క్రాంతికుమార్, దేవానంద్, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, మధు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, లక్ష్మినారాయణ, సరోజ, రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.