Thursday, April 24, 2025
spot_img
Home Blog Page 6

29వ తేదీ నుండి మూడు,ఐదు సెమిష్టర్ పరీక్షలు ప్రారంభం..ఎన్.టి.కె.నాయక్,

0

ఈ నెల 29వ తేదీ నుండి మూడు,ఐదు సెమిష్టర్ పరీక్షలు ప్రారంభం

ఎన్.టి.కె.నాయక్,వర్సిటీ వైస్ఛాన్సులర్ ఆచార్య

కర్నూలు ఎడ్యుకేషన్ : నవంబర్ 29

రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో మూడు,ఐదు వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభమైనట్లు వర్సిటీ వైస్ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె.నాయక్ పరిశీలించారు.మేరకు శుక్రవారం ఈ పరీక్షలకుగాను కర్నూలు, నంద్యాల జిల్లాలో మొత్తం 61పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారంలేకుండా పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండ్లకు ఆయన సూచించారు.పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నేడు నగరంలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి,ఎస్ టిబిసి కాలేజీల్లో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆయన వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. పరీక్షలు జరుగుతన్న విధానంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

కడప ఉక్కు పరిశ్రమ సాధించాలి – డివైఎఫ్ఐ

0

కడప ఉక్కు కోసం రాష్ట్ర ఎంపీలు రాజీనామ చేసైనా కడప ఉక్కు పరిశ్రమ సాధించాలి – డివైఎఫ్ఐ

నవంబర్ 29 : కడప

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై చర్చ జరిపి అవసరమైతే ఈ రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసైన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల, శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పై నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు. విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతున్నారు.మరికొందరు ఇతర రాష్ట్రాలలో పనులకు వెళుతున్నారు అన్నారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరం అన్నారు. అందులో ఉక్కు పరిశ్రమ లాంటి భారీ పరిశ్రమ వస్తే ఎక్కువ సంఖ్యలో యువతకు ఉపాధి లభించే అవకాశం వుంటుంది.కానీ అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్న చందండ కడప ఉక్కు పరిశ్రమ పరిస్థితి తయారైంది అన్నారు. ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ ప్రాంత వాసులేనని ముఖ్యమంత్రులు మారుతున్న, వాళ్ళు వేసిన శిలాఫలకాలు మారుతున్న కడప ఉక్కు పునాది రాయి ముందుకు కదలడం లేదన్నారు. శిలాఫలకాలు సమాధిరాళ్ళ లెక్క వెక్కిరిస్తున్నాయి అన్నారు. గడిచిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కడప ఉక్కు కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోంది అన్నారు. మన రాష్ట్ర,ప్రాంత ఎంపీలు ప్రాంత భవిష్యత్ కోసం,యువతకు ఉపాధి కోసం పార్లమెంటులో గలమెత్తాలి అన్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి కడప ఉక్కు కు నిధులు సాధించాలని అన్నారు. లేకుంటే ఇక్కడి ప్రాంత యువత, ప్రజలు క్షమించరు అన్నారు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు రాష్ట్రమంతా ఒకే నినాదంతో నినదించి విశాఖ ఉక్కును సాధించారో ఆ స్ఫూర్తితోనే కడప ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంగా రాష్ట్రమంతా నిలిచి యువత పోరాడి కడప ఉక్కును సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్, షరీఫ్, ఎస్ కే ఆదిల్, నాగేంద్ర, ఇంద్ర, సురేష్, ఖలీల్ భాష, రామకృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాతృ శిశు మరణాల రేటు జీరో స్థాయికి తీసుకరండి…జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

0

మాతృ శిశు మరణాల రేటు జీరో స్థాయికి తీసుకరండి

గర్భిణీ స్త్రీ, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

*నంద్యాల, నవంబర్ 29:-

పుట్టిన వెంటనే నవజాత శిశువులు మృత్యువాత పడకుండా నిరంతరాయంగా పాలఫ్ చేస్తూ పిల్లలను సంరక్షించే బాధ్యత వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మేటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డా. జఫరుల్లా, జిజిహెచ్ గైనకాలజిస్ట్ డా. పద్మజ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ డా.శ్రీజ, డిఐఓ డా. ప్రసన్న, ఐసిడిఎస్ పిడి లీలావతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో, అప్పుడే పుట్టిన నవజాత శిశువును సంరక్షించుకోవడంలో మెళుకువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ప్రసవం తర్వాత మాతృ మరణాలు జరిగి పిల్లలను అనాధలు చేస్తున్నామన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉండి కూడా తల్లి బిడ్డలను సంరక్షించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం భాధకరమన్నారు. ఇది నాపని, ఇది వాళ్ళపని ఒకరి మీద ఒకరు వేసుకోకుండా సమన్వయంతో పనులు చేసుకుంటూ వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసమే ప్రతి సోమవారం అధికారులు, సిబ్బందిని ఒకే చోట సమావేశపరిచి కోఆర్డినేషన్ ఇబ్బంది లేకుండా పలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇటీవల తాను అంగన్వాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు చిన్న గదిని కూడ శుభ్రం పెట్టుకోలేని స్థితిలో వున్నారన్నారు. పిల్లలకు గ్రుడ్లు ఇవ్వడంలో, పోషణ్ అభియాన్ కిట్ల సరఫరాలో నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత సమావేశంలో నాలుగు మాతృ మరణాలు, మూడు శిశుమరణాలు జరిగాయని… వచ్చే సమావేశానికి జీరో స్థాయిలో ఉండాలని చెప్పినప్పటికీ ప్రస్తుత క్వార్టర్లో మూడు శిశు మరణాలు, ఒక మాతృ మరణం జరగడం బాధాకరమన్నారు. మాతృ శిశు మరణాల నివారణలో వైద్యశాఖ స్త్రీశిశు సంక్షేమ శాఖలు పూర్తిగా వైఫల్యం చెందాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం, పుట్టిన వెంటనే సరైన చికిత్స చేయకపోవడం, ముందస్తుగా ప్రసవం వంటి తదితర కారణాలతో మృత్యువాత పడుతున్నారని క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు మెరుపరచుకొని భవిష్యత్తులో ఎలాంటి మాతృ, శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వైద్య, స్త్రీ శిశు సంక్షేమ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ, నంద్యాల వారి ద్వారా జారీ

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గిద్దలూరు యువకుడు..

0

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గిద్దలూరు యువకుడు..

నవంబర్ 29 ; ప్రకాశం

ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి ఖ్వాజా రహీం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రహీం మేనమామ అయిన 12వ వార్డు మాజీ కౌన్సిలర్ అల్తాఫ్ సహకారంతో ప్రయోజకుడుగా మారాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి విద్యను రహీం అభ్యసించాడు. ఇటీవల పరీక్షలు రాసిన రహీం పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. పలువురు రహీమ్ ని అభినందిస్తుండగా తన అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన మేనమామతో పాటు కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని అన్నారు.

BIG BREAKING : డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆగ్రహం …

0

BIG BREAKING : డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆగ్రహం …

నవంబర్ 29: కాకినాడ

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు. ‘ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

శ్రీవారి ఆలయ బూంది పోటులో సిట్ బృందం తనిఖీలు….-సిట్ అధికారుల బృందం కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు గోప్యం..!

0

శ్రీవారి ఆలయ బూంది పోటులో సిట్ బృందం తనిఖీలు….
-సిట్ అధికారుల బృందం కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు గోప్యం..!


తిరుమల.
Nov 29, 2024,

శ్రీవారి ఆలయ పోటులో సిట్ బృందం తనిఖీలు…
తిరుమల శ్రీవారి ఆలయంలోని పోటులో గురువారం సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆలయంలోని బూందీ పోటుని తనిఖీ చేసింది. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిట్‌ అధికారులు పోటు కార్మికుల వద్ద వివరాలు సేకరించారు. అంతేకాకుండా పోటు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అయితే సిట్‌ అధికారుల బృందం కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని గోప్యంగా నిర్వహిస్తోందని తెలుస్తోంది.

ధననీయంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఏపీ అప్పులపై పయ్యావుల క్లారిటీ…

0

ధననీయంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఏపీ అప్పులపై పయ్యావుల క్లారిటీ…
నవంబర్ 28:అనంతపురం.
ఏపీలో ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పలు సందర్భాల్లో ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపై చెప్పడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని అసెంబ్లీలో పెట్టామని గుర్తుచేశారు. ఆ తర్వాత శాసనసభ, శాసన మండలిలోనూ చెప్పామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి దయనీయమైన పరిస్థితిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

బ్రాండ్ చంద్రబాబు పేరుతో రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రాన్ని ముందుకు నెట్టగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

అప్పులు చేయడం తప్పు కాదు… చేసిన అప్పులను అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా పెంచుకోవాలనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఎంత పెంచిన జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమించడానికి చాలా కాలం శ్రమ పడాల్సి వస్తుందన్నారు. అప్పుల మీద వడ్డీని తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీని తీర్చడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

అమరావతి లోనే రిపబ్లిక్ డే వేడుకలు..

0

అమరావతి లోనే రిపబ్లిక్ డే వేడుకలు..

అమరావతి : నవంబర్ 28

ఏపీలో రిపబ్లిక్ డే (జనవరి 26) వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టవర్ల సమీపంలో ఎన్ఆర్టీ టవర్స్కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ముఖ్యమంత్రి కార్యాలయ
అధికారి సురేశ్కుమార్, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు.

థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులు..-పట్టుకున్న విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ డి ఆర్ ఐ అధికారులు..

0

థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులు..
-పట్టుకున్న విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ డి ఆర్ ఐ అధికారులు..

విశాఖపట్నం:
అక్రమంగా తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్‌ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు..

థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా వీటిని తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఐ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బల్లులను డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.

కర్నూల్ DPO కార్యాలయ ఆవరణంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం …

0

కర్నూల్ DPO కార్యాలయ ఆవరణంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం …
నవంబర్ 27: కర్నూలు.

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం కార్తీక మాస వన భోజన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు పరిపాలన శాఖ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో కార్తీక మాస వన భోజన మహోత్సవాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హాజరై (ధాత్రి నారాయణ) అమలకి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం ఆయనతోపాటు పోలీసు మినిస్టీరియల్ సిబ్బంది అంతా ధాత్రి నారాయణ చెట్టు కింద వనభోజనం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ధాత్రీ నారాయణ చెట్టు కింద భోజనం చేయడం మంచిదని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో జరుపుకొని సంతోషంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏడీఎంఎన్) హుస్సేన్ పీరా, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.