Wednesday, April 23, 2025
spot_img
Home Blog Page 3

అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర…

0

అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర….
బివిఆర్ టుడే న్యూస్ డిసెంబర్ 8 గుంతకల్లు
గుంతకల్లు పట్టణంలో ఆదివారం సాయంత్రం పాత గుంతకల్లు ప్రాంతంలోని శివాలయం నుండి పట్టణ ప్రధాన పురవీధులలో శ్రీ అయ్యప్ప స్వామి వారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్షాపరులు శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తిని అత్యంత సుందరంగా విశేష అలంకరణ గావించి విద్యుత్ కాంతుల నడుమ ట్రాక్టర్ వాహనంలో ఉపస్తింపజేసి ప్రత్యేక పూజలతో పట్టణ ప్రాకారోత్సవంకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారి శోభాయాత్ర వాహనం ముందుగా దీక్షాపరులు భక్తి ప్రపత్తులతో శ్రీవారి నామస్మరణ గానం చేస్తూ కొనసాగారు. ఈ క్రమంలోనే పలువురు దీక్షాపరులు రహదారులలో శ్రీవారి హుండీలలో భక్తులచే కానుకల సమర్పణకు భిక్షాటన చేపట్టగా పలువురు శోభాయాత్ర ముందు బాణాసంచా పేల్చుతూ అంగరంగ వైభవంగా కొనసాగించారు. శోభాయాత్రలో భాగంగా పట్టణ పురవీధులలోని భక్తజనులు శ్రీ స్వామివారిని నేత్రానందకరంగా దర్శించుకుంటూ తమ మొక్కలను తీర్చుకున్నారు.

మున్సిపల్ కమిషనర్ గారు…కసాపురం దేవస్థానం ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు సమంజసం…– ఇతర ప్రచారాల ఫ్లెక్సీల పట్ల మమకారం తగునా…భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ ..

0

మున్సిపల్ కమిషనర్ గారు…
కసాపురం దేవస్థానం ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు సమంజసం…
— ఇతర ప్రచారాల ఫ్లెక్సీల పట్ల మమకారం తగునా…
— భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ ..

డిసెంబర్ 8 గుంతకల్లు బి.వి.ఆర్ టుడే న్యూస్
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో జరుగు శ్రీ హనుమద్ జయంతి వేడుకల ప్రచార ఫ్లెక్సీలను పట్టణ ప్రధాన రహదారుల్లో ఏర్పాటును గుంతకల్లు పురపాలక సంఘం అధికారులు తొలగింపులుగా చేపట్టిన చర్యలు హేయమని, భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ ఉద్ఘాటించారు. ఆదివారం భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దీక్షాపరులతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హిందువుల పట్ల జరుగుతున్న అరాచకాలను తమ బిజెపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తీరుందని గుర్తించాలన్నారు. ఈ క్రమంలో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి హనుమద్ వ్రతం కార్యక్రమం నిర్వహణ ప్రచార సాధనాలుగా పట్టణంలో ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. కానీ గుంతకల్లు పురపాలక శాఖ అధికారులు తమ తమ అధికార దుర్వినియోగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయా ఫ్లెక్సీలను తొలగిస్తూ చర్యలు చేపట్టడం చాలా హేయంగా ఉందన్నారు. సదర అధికారులను ప్రశ్నిస్తే తమ అనుమతులు తీసుకోలేదంటూ బుకాయింపు ధోరణిగా మాట్లాడటం వారి విజ్ఞత ఏ పాటిదో తేటతెల్లమవుతుందన్నారు. పట్టణంలో మున్సిపల్ అనుమతులు లేమిగా ఏర్పాటులోని ఇతర ప్రచార సాధనాలుగా ప్రకటనల ఫ్లెక్సీలు ఉండటాన్ని మమకారంగా చూస్తూ అధికార దర్పంలో వారు స్వాగతిస్తు చోద్యం చూస్తున్న తీరు హేయమన్నారు. పట్టణంలో అనేక రకాలుగా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న తీరున్నా వాటి పట్ల మమకారం చూపడం, దేవాలయాల ప్రచారాల పట్ల వారు ఆదాయం చూసుకోవడం ఎంతవరకు సమంజసమని, మున్సిపల్ ఆదాయంలో అనేక రకాల అక్రమ కట్టడాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తూ తమ విధులను నిర్వహిస్తున్న తీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నామన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా విధుల చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులుగా విధులను కొనసాగించాలే కానీ ప్రస్తుతం మతముల ప్రాధాన్యతగా రెచ్చగొట్టే విధంగా అధికారులు విధుల నిర్వహిస్తున్న తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో తాము హిందువులుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంటుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు.

రైతులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..!!

0

RBI: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..!!

BVR today news..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న, సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి హామీ లేకుండా చిన్న, సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణాల పరిమితిని లక్షా 66 వేల నుంచి 2 లక్షలకు పెంచింది.ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో నెలకున్న ద్రవ్యోల్బణం దృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడంతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాల పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. హామీ లేకుండా పంట రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో ఆర్బీఐ సవరించింది. అప్పుడు రుణ పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.60 లక్షలకు పెంచింది. తాజాగా దీన్ని రెండు లక్షలకు పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పట్టదారు పాస్ బుక్ ను తాకట్టుగా పెట్టుకుంటున్నాయి. కాగా తెలంగాణలో పలువురి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేసింది. అయితే ఇప్పటి వరకు చాలా మంది అన్నదాతలకు రుణ మాఫీ కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం రుణ మాఫీ చేసుకుంటున్నట్లుగా ప్రకటించుకుంటుంది. తెలంగాణలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. ఇక రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు.వర్షాకాలం సీజన్ ముగిసినా రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి మొదలు కాబోతోంది. అయినా రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

గ్రామ రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోండి.. ఎమ్మార్వో ఎస్ .రమాదేవి

0

గ్రామ రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోండి.. ఎమ్మార్వో ఎస్ .రమాదేవి

డిసెంబర్ 6:గుంతకల్లు

గుంటకల్ మండల పరిధిలోని నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల కసాపురం గ్రామం , మధ్యాహ్నం సంఘాల గ్రామాలలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని. గుంతకల్ తహసిల్దార్ ఎస్ రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు.ఆయా గ్రామాలకు సంబంధించి భూముల రికార్డులను అప్డేట్ చేసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి భూసమస్యలను అసైన్డ్, డొంక, వాగు పోరంబోకు, ఇనాం, దేవదాయ, వక్స్, 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వివరాలు సేకరిస్తామన్నారు.

ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యాసంస్థ…

0

ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యాసంస్థ

అమరావతి.

ఏపీలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) తన క్యాంపస్ ను రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అన్ని హంగులతో అమరావతిలో ప్రాంగణాన్ని
నిర్మించనున్నట్లు తెలిసింది. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది.50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. బిట్స్ క్యాంపస్ రాకతో రాజధాని ప్రాంతం విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

మొదటి దఫాలో రూ. కోటితో రెండో దఫాలో మరో రూ. కోటితో హంగులు..జిల్లా సబ్ డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు

0

నగర వనాన్ని ఆరోగ్యవరంగా తీర్చిదిద్దుతాం:

  • మొదటి దఫాలో రూ. కోటితో రెండో దఫాలో మరో రూ. కోటితో హంగులు
  • జిల్లా సబ్ డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు

మదనపల్లి డిసెంబర్ 3 :

మదనపల్లె బసినికొండలో రూ. రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాన్ని, పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్యవరంగా తీర్చిదిద్దు తున్నట్లు అన్నమయ్య జిల్లా సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఫారెస్ట్ ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో పట్టణ ప్రజల సౌకర్యార్థం పుంగనూరు రోడ్డు, బసినికొండలో నగర వనాన్ని ఆరోగ్యవరంగా అన్ని రకాల హంగులతో తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇప్పటివరకు కోటి రూపాయల వరకు ఖర్చుపెట్టి నగర వనాన్ని అన్ని రకాల హంగులతో ఏర్పాటు చేశామన్నారు మరో కోటి రూపాయల నిధులను వెచ్చించి మదనపల్లె ఆరోగ్య వరాన్ని తలపించేలా ఇక్కడ కూడా మరో ఆరోగ్య వరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ జయప్రసాదరావు, డిఆర్ఓ మదన్ మోహన్, ఎఫ్బి వోలు ఏబీవోలు పాల్గొన్నారు.

పోలీస్ ప్రీ ప్రైమరీ స్కూలు చిన్నారులతో మమేకమైన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS…

0

పోలీస్ ప్రీ ప్రైమరీ స్కూలు చిన్నారులతో మమేకమైన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS..

నవంబర్.03: అనంతపురం.

పోలీస్ ప్రీ ప్రైమరీ స్కూల్ చిన్నారులను తన సొంత పిల్లల్లా ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కాసేపు ముచ్చటించారు
చిన్నారుల వచ్చి రాని మాటలకు, చేష్టలకు మంత్రముగ్దుడయ్యారు
గత నెలలో నిర్వహించిన చిల్డ్రెన్స్ డే విజయవంతమయ్యిందని… ఆ రోజున ఎస్పీ దంపతులు చూపిన చొరవ, కార్యక్రమం నిర్వహణపై కృతజ్ఞతలు తెలియజేయడానికి జిల్లా పోలీసు కార్యాలయం వచ్చిన స్కూలు చిన్నారులు
ఎస్పీ కి గులాబీలు అందజేసి పిల్లలు థ్యాంక్స్ చెప్పడంతో ఎస్పీ గారి ఆనందానికీ అవధుల్లేకుండా పోయాయి.
ఎస్పీ కాసేపు హోదా మరిచారు. పిల్లలతో జత కలిశారు. వాళ్లతో లీనమయ్యారు. ఆశీస్సులు అందజేశారు. చాక్లెట్స్ పంచి పెట్టారు.

అవినీతి సామ్రాట్ బిరుదుతో జగన్ ను సత్కరించాలా..? సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎద్దేవా

0

అవినీతి సామ్రాట్ బిరుదుతో జగన్ ను సత్కరించాలా..? సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎద్దేవా

డిసెంబర్ 01 :కర్నూలు

వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి ఏం చేశారని ఆయనను సత్కరించి, శాలువా కప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు, ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు శాలువా కప్పాలా అని ప్రశ్నించారు. దేశంలోనే అవినీతి సామ్రాట్ అని జగన్కు సన్మానం చేయాలా అంటూ విమర్శించారు. విద్యుత్
వ్యవస్థలను రూ. లక్ష కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. జగన్ అవినీతి ఆనాడు రాష్ట్రం దాటితే.. ఇప్పుడు దేశం దాటిందన్నారు. రాష్ట్రం పరువు తీయడమే కాకుండా గొప్పలకు పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తప్పులను కప్పిపుచ్చుకొని అవినీతిని కూడా గొప్పగా చెప్పుకోవడం జగన్కు సాధ్యమని విమర్శించారు.

ఎక్స్టెన్షన్ కాలనీలలో తాగేందుకు నీళ్లను కూడా ఇవ్వని పాలకుల విధానాలను ఎండగడదాం…సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే ప్రభాకర్ రెడ్డి.

0

పట్టణ ప్రాంతంలో పరిశ్రమలు – ఉపాధికై ఉద్యమిద్దాం

ఎక్స్టెన్షన్ కాలనీలలో తాగేందుకు నీళ్లను కూడా ఇవ్వని పాలకుల విధానాలను ఎండగడదాం

ఘనంగా ప్రారంభమైన సిపిఎం నగర 3వ మహాసభ..


డిసెంబర్ 01 :కర్నూలు.
జిల్లా కేంద్రంగా ఉన్న కర్నూలు నగరం లో ఏటేటా పెరుగుతున్న జనాభాతో పాటు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందని, ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఎక్స్టెన్షన్ కాలనీలకు కనీసం మంచినీళ్లను కూడా సరిగా సరఫరా చేయని పాలకుల విధానాలను ఎండగడదామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో జరుపుతున్న సిపిఎం కర్నూల్ న్యూ సిటీ మూడవ మహాసభకు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు మహాసభ ప్రారంభ సూచికగా సిపిఎం పతాకాన్ని సిపిఎం న్యూ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా ఎగరవేశారు. నగర నాయకులు ఆర్ నరసింహులు, కె అరుణమ్మ, శంకర్ ల అధ్యక్షతన జరిగిన మహాసభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల మాట్లాడుతూ రాయలసీమ ముఖద్వారంగా కర్నూల్ నగరం ఉన్నప్పటికీ ఉపాధి లేక యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నారన్నారు. నగరం నుండి చదువుకున్న యువత ఉద్యోగాల కోసం బొంబాయి, బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు లాంటి ప్రాంతాలకు వలసలు పోతున్న పరిస్థితి ఉందన్నారు. చదువుకోని యువత ఉపాధి లేక పెరుగుతున్న ధరలతో కొని తినలేని పరిస్థితి దాపురించిందన్నారు. నగర పరిధిలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉన్న ఉపాధి అవకాశాలు తక్కువేనన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అయినా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించాలన్నారు. పెరుగుతున్న కొత్త కాలనీలలో లక్షలు వెచ్చించి స్థలాలు కొని ఇల్లు కట్టుకున్న వారికి మౌలిక సౌకర్యాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. చివరికి తాగేందుకు మంచినీళ్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. సిపిఎం నగర కమిటీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల కారణంగా ప్రజలు మోస్తున్న భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతోపాటు, ప్రజలకు ఉపాధి, గృహ సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, నాణ్యమైన విద్య కోసం నికరమైన పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల రక్షణకు కరాటే లాటి మార్షల్ ఆర్ట్స్ లో సరైన రక్షణ కవచం..

0

ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల రక్షణకు కరాటే లాటి మార్షల్ ఆర్ట్స్ లో సరైన రక్షణ కవచం..

-తైక్వాండో క్రీడాకారులకు బ్యాగులు, చలి నుండి రక్షణ కోసం మంకీ క్యాప్ లు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.

కర్నూలు, డిసెంబర్ 1 .

ప్రస్తుతం ఉన్న సమాజంలో బాలికల రక్షణకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ సరైన రక్షణ కవచమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో తై క్వాండో శిక్షకుడు టి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ బ్యాగులతో పాటు ప్రస్తుతం ఉన్న చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్ లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో బాలికలపై దాడులు, అత్యాచార ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ,వాటిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరమని చెప్పారు .బాలికల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను వెంట ఉండి కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించడం వల్ల వారు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారని చెప్పారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల బాలికలు తమను తాము రక్షించుకోవడంతోపాటు ఆపదలో ఉన్నవారిని సైతం రక్షించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఏ దేశంలో అయితే స్త్రీలు స్వేచ్ఛగా, ధైర్యంగా బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాగలుగుతారో.. అలాంటి దేశాలే అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల క్రమశిక్షణతో పాటు మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందనిజ్ తద్వారా వారు ఎంచుకున్న రంగాల్లో వారు మరింత రాణించగలుగుతారని తెలిపారు. కరాటేలో శిక్షణ పొందడం వల్ల అందులో ధ్యానం ,ప్రాణాయామం, ఏకాగ్రత పొందడంతో పాటు శారీరక వ్యాయామం పెంపొంది ఆరోగ్యకరంగా జీవించగలుగుతారని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో ఉందని ,వారిని క్రమశిక్షణ గల పౌరులుగా దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఒకే ఒక ఆయుధం క్రీడలు మాత్రమేనని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలు యువ సంపద కోసం మన దేశం వైపు చూస్తున్నాయని ఆయన వివరించారు. యువతను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదించినప్పుడే మన దేశం ప్రపంచంలోనే అన్ని దేశాలకు నాయకత్వాన్ని వహించే స్థాయికి ఎదుగుతుందని వివరించారు .కర్నూల్ నగరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సామాజిక సేవా దృక్పథంతో క్రీడలను ప్రోత్సహించేందుకు నిరంతరం తన వంతు సహకారం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో సీనియర్ శిక్షకుడు టీ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.