Sunday, January 19, 2025
spot_img
Home Blog Page 2

జై భీమ్ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు…

0

జై భీమ్ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు

బివిఆర్ టుడే న్యూస్, డిసెంబర్ 22 :

జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుతో సభ్యుల నియామకం జరిగింది. ఆదివారం మద్దికేర మండల కేంద్రంలోని కార్యాలయంలో ఆయన నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏర్పాటులో భాగంగా కర్నూలు జిల్లా జై భీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా గద్దల రాజును నియమించినట్లు ప్రకటించారు. అలాగే కర్నూలు జిల్లా సలహాదారునిగా గద్దల చిన్న, మద్దికేర ప్రధాన కార్యదర్శి కొమ్ము రామాంజనేయులు, మద్దికేర మండలం అధ్యక్షుడు మాల తిమ్మప్ప, మండల ఉపాధ్యక్షులు పారా రత్నమయ్య, మద్దికేర మండల సలహాదారునిగా గంధం రాము, మద్దికేర పట్టణ అధ్యక్షులు నబి సాహెబ్, మద్దికేర మండలం యూత్ ప్రెసిడెంట్ గా బండారు మహేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి గద్దల రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను అమలుపరచడానికి మా పైన నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి గుండాల కిరణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు..సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత కొత్త మెనూ అమల్లోకి రానుంది…

0

*మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు

సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత కొత్త మెనూ అమల్లోకి రానుంది

బివిఆర్ టుడే న్యూస్

అమరావతి. డిసెంబర్ 19

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పాఠశాల విద్యార్థులకు అందించే ఆహారాన్ని వారి స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా మార్పు చేసింది. ఇందుకోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో కీలక మార్పులు చేసింది. అయా ప్రాంతాల్లో విద్యార్ధుల ఆహార అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా వంటకాల మెనూ రూపొందించారు.

మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సమగ్ర అధ్యాయనం తర్వాత విద్యార్ధుల అభిరుచులకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేశారు. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత కొత్త మెనూ అమల్లోకి రానుంది. ప్రతి మంగళవారం మాత్రం విద్యార్థులు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించి మెనూ రూపొందించారు. జోన్‌ 1లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి.
జోన్‌ 2లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి.
జోన్‌ 3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.
జోన్ 4లో చిత్తూరు,కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
సోమవారం జోన్‌ 1లో అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, జోన్‌ 2లో అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ అందిస్తారు. జోన్‌ 3లో అన్నం, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కీ ఇస్తారు. జోన్‌ 4లో అన్నంతో కూరగాయల కూర ఉడికించిన గుడ్డు, చిక్కీ ఇస్తారు.
మంగళవారం జోన్‌ 1లో అన్నంతో పాటు గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ ఇస్తారు. జోన్‌ 2లో పులిహార, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజావ అందిస్తారు. జోన్‌3లో పులిహార, టామాటా లేదా పుదీన చట్నీ, గుడ్డు ఫ్రై, రాగిజావ అందిస్తారు,. జోన్ 4లో పులగం లేదా పులిహార, పల్లీ చట్నీ, కోడిగుడ్డు ఫ్రై, రాగిజావ అందిస్తారు.
బుధవారం జోన్‌ 1లో వెజ్‌ పలావ్‌, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, జోన్2లొ అన్నం, కూరగాయల కూర, గుడ్డు, చిక్కీ ఇస్తారు. జోన్ 3లో అన్నం, 4రకాల కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ అందిస్తారు. జోన్‌ 4లో అన్నం, సాంబారు, గుడ్డు, చిక్కీ అందిస్తారు.
గురువారం జోన్‌ 1లో అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ, జోన్‌2లో వెజ్ రైస్, పులావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ అందిస్తారు. జోన్‌3లో వెజిటేబుల్ రైస్‌, పలావ్‌, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ ఇస్తారు. జోన్‌ 4లో వెజిటేబుల్ రైస్‌, గుడ్డు కూర, రాగిజావ అందిస్తారు.
శుక్రవారం జోన్‌1లో పులిహార, గోంగూర చట్నీ, లేదా కూరగాయలతో చట్నీ, గుడ్డు చిక్కీ అందిస్తారు. జోన్‌2లో అన్నం, ఆకుకూర పప్పు, గుడ్‌ ఫ్రై, చిక్కీ అందిస్తారు. జోన్ 3లో అన్నం, గుడ్డుకూర, చిక్కీ అందిస్తారు. జోన్‌4లో అన్నం, ఆకుకూరపప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ అందిస్తారు.
శనివారం జోన్‌1లో అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్ పొంగల్ అందిస్తారు. జోన్ 2లో అన్నం, ఆకుకూరలతో కూర, స్వీట్ పొంగల్, రాగిజావ ఇస్తారు. జోన్‌3లో అన్నం, టమాటా పప్పు, పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ అందిస్తారు. జోన్‌ 4లో అన్నం, కందిపప్పు చారు. బెల్లం పొంగలి, రాగిజావ అందిస్తారు.

మానవ హక్కుల సమితి రాయలసీమ జిల్లాల అధ్యక్షునిగా గుమ్మనూరు నాగార్జున…

0

మానవ హక్కుల సమితి రాయలసీమ జిల్లాల అధ్యక్షునిగా గుమ్మనూరు నాగార్జున…

బివిఆర్ టుడే న్యూస్.

డిసెంబర్ 17 గుంతకల్లు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం, జాతీయ మానవ హక్కుల సమితి, రాయలసీమ జిల్లాల జోనల్ అధ్యక్షునిగా గుమ్మనూరు నాగార్జున ని నియమిచ్చినట్లు జాతీయ మానవ హక్కుల సమితి చైర్మన్,తూము రామచంద్ర నాయుడు, జాతీయ మానవ హక్కుల సమితి, వైస్ చైర్మన్, మరియు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.ఎస్ కృష్ణారెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా ఎన్నికైన గుమ్మనూరు నాగార్జున మాట్లాడుతూ, ఇంతకుముందు జాతీయ మానవ హక్కుల సమితి, అనంతపురం సత్య జిల్లాల కన్వీనర్ గా ఉన్న నన్ను, గుర్తించి, నాపై నమ్మకం ఉంచి నాకీ ఉన్నత పదవి ఇచ్చినందుకు, చైర్మన్ తూము రామచంద్ర నాయుడు, వైస్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ బి ఎస్ కృష్ణారెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాపై నమ్మకం ఉంచి నాకిచ్చిన పదవికి, పూర్తిగా న్యాయం చేస్తానని, మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, సమస్త కు ఎటువంటి అపకీర్తి తీసుకురాకుండా, నీతి నిజాయితీగా పనిచేస్తానని, మానవ హక్కుల పరిరక్షణ సమితి, సభ్యులంతా ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తారని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, పనిచేస్తానని గుమ్మనూరు నాగార్జున తెలియజేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్షణ పేరుతో పలువురు ఓ ప్రైవేట్ వైద్యకళాశాల విద్యార్థులు హల్ చల్…– అడ్డుకున్న ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి.

0

ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్షణ పేరుతో పలువురు ఓ ప్రైవేట్ వైద్యకళాశాల విద్యార్థులు హల్ చల్…
— అడ్డుకున్న ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి.
— పలువురు వైద్యుల సహాయ సహకారంతో విద్యార్థుల హాజరు…?
బి.వి.ఆర్.టుడే న్యూస్, డిసెంబర్ 16, గుంతకల్లు.
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక అధికారులచే ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా విచ్చలవిడిగా పట్టణ శివారులోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థినిలు శిక్షణ పేరుతో తారసపడుతూ పలువురి వైద్య బృందం కు సహకారంగా విధులు నిర్వహిస్తున్న తీరుండడం గమనార్హం. సోమవారం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ శివారులోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన పలువురు (యుక్త వయసు గల) వైద్య విద్యార్థినీలు శిక్షణ పేరుతో ఆసుపత్రి వార్డులలో సంచరిస్తున్న తీరులో హల్ చల్ గా మారింది. సదరు ఆసుపత్రిలో పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామ్ ప్రసాద్ రావు గుర్తించి స్థానిక సెక్యూరిటీ సిబ్బందిచే వివరాలను సేకరించారు. దీంతో ఆయన ఆయా వార్డులలో పర్యటిస్తూ సదరు విద్యార్థినుల పట్ల ఆరా తీస్తూ సెక్యూరిటీ సిబ్బందిచే వారించి బయటకు పంపించేశారు. ఈక్రమంలో ఆయన తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా సదరు ప్రైవేట్ వైద్య కళాశాల యజమానిని తానేనంటూ తమ కళాశాలకు సంబంధించిన వైద్య విద్యార్థినీలకు శిక్షణ ఇస్తున్నట్లుగా చెప్పాలని, వారి శిక్షణ పట్ల ప్రత్యేక అధికార బృందం పరిశీలన చేస్తున్నారని వారితో శిక్షణ జరుగుతున్నట్లు పేర్కొనాలంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకు ఆయన ససేమిరా అంటూ తమ వద్ద వారి విద్యార్థినీల వివరాల ప్రభుత్వ ఉత్తర్వుల ఆమోద పత్రాలు లేకపోవడంను తాను సమ్మతించనని నిరాకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో గత ఫిబ్రవరి మాసంలో కూడా ఇదే తీరుగా పలువురు విద్యార్థినీలు శిక్షణ పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలో హల్ చల్ చేయగా అప్పుడు ఆయన ( ఏవో) ప్రశ్నించడంతో ఆ విద్యార్థినీలు పరుగులు పెట్టినవైనం లేకపోలేదు. మరోమారుగా సదరు వైద్యకళాశాలకు చెందిన ఆసుపత్రిలో శిక్షణ పేరుతో సంచరించడం కొసమెరుపు. వారు ప్రభుత్వ నిబంధనల అతిక్రమణ గా ఆసుపత్రిలో సంచరించడం ఏదేని ప్రమాద సంఘటనల చర్యలకు బాధ్యులు ఎవరు అన్న చర్చలు ఆసుపత్రి ప్రాంగణంలో గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. ఇలా సదరు కళాశాలకు చెందిన విద్యార్థినీలు ఆసుపత్రిలో శిక్షణ పొందేందుకు ఆసుపత్రి అధికార యంత్రాంగం దృష్టికి లేమిగా పరోక్షంగా పలువురు వైద్య బృందం సహాయ సహకారాలతో ఇలా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆసుపత్రి పర్యవేక్షణ అధికారిని వివరణ కోరగా జరిగినది వాస్తవమేనని, ఈ విషయంపై తాను ఆ కళాశాల యాజమాన్యం వద్ద ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించడం తాను సహించని ఉన్నతాధికారులకు సమాచారం అందజేస్తామన్నారు.

శ్రీవారి ఆర్జిత సేవా మార్చి నెల టికెట్లు కోటా విడుదల..

0

శ్రీవారి ఆర్జిత సేవా మార్చి నెల టికెట్లు కోటా విడుదల..

బివిఆర్ టుడే న్యూస్ తిరుమ‌ల‌, డిసెంబర్16

    తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌,  అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబ‌రు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

    ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

    ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

డిసెంబ‌రు 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

   కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

డిసెంబ‌రు 21న వర్చువల్ సేవల కోటా విడుదల

    వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

డిసెంబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

     మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

     శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

 వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

డిసెంబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

 మార్చి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో మార్చి నెల గదుల కోటాను డిసెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

రోడ్డు ప్రమాదంలో ఆర్ఎస్ పెండేకల్ గ్రామ వీఆర్వో మృతి…

0

రోడ్డు ప్రమాదంలో ఆర్ఎస్ పెండేకల్ గ్రామ వీఆర్వో మృతి…
బివిఆర్ టుడే న్యూస్ డిసెంబర్ 16. మద్దికెర
అతివేగం ప్రమాదకరం అన్న నానుడికి తార్కాణంగా రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు మారుతున్న ప్రాణహానికరంతో కూడిన దయనీయమైన దుస్థితిలో రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారిన వైనంలో వాహనాల ప్రయాణంలో భాగంగా మద్దికెర మండలం బురుజుల గ్రామ సమీపంలోని వంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రెవెన్యూ గ్రామ వీఆర్వో మృత్యుపాలైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్ గ్రామంలో రెవెన్యూశాఖలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న కె.టి. శ్రీనివాసులు (37)అనే ఉద్యోగి తన ద్విచక్రవాహనంలో మద్దికెర నుండి పత్తికొండ వైపుగా రోడ్డుపై ప్రయాణిస్తూ బురుజుల వంక వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శవపరీక్షలు నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదరు మృతుడు తుగ్గలి మండలం రామకొండ పగిడిరాయి గ్రామనివాసి, ఆయనకు భార్య కళావతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానమన్నారు. ఈ ప్రమాద సంఘటన విషయంపై మద్దికెర పోలీసులు పూర్తి వివరాలతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకులకు గాయాలు.. మెరుగైన వైద్యం కోసం ఒకరిని కర్నూలు కి తరలింపు..

0

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. మెరుగైన వైద్యం కోసం ఒకరిని కర్నూలు కి తరలింపు..

బి వి ఆర్ టుడే న్యూస్

మద్ది కెర డిసెంబర్ 11. మద్దికెర, గుంతకల్లు ప్రధాన రహదారిలో మద్దికెరగ్రామ సమీపంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఒక వాహనం బైక్ ఢీకొన్నాయి. పారాహర్ష, అభి ఇద్దరి యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. గుంతకల్లు నుంచి మద్దికెర వస్తున్న వాహనం మద్దికెర నుండి గుంతకల్లువెళ్తున్న బైకు ప్రమాదంలో అభి అనే యువకుడికి చేయి విరగగా హర్ష అని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఒకరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు మద్దికెరఎస్సై విజయకుమార్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొగాకు ప్రాణాంతకం…ధూమపానం అనారోగ్యం…

0

పొగాకు ప్రాణాంతకం…
ధూమపానం అనారోగ్యం…

డిసెంబర్ 10,గుంతకల్లు బి.వి.ఆర్ టుడే న్యూస్.
పొగాకుతో తయారు చేయబడిన బీడీలు, సిగరెట్లు తదితర ఉత్పత్తులు ప్రాణాంతకరమని, ప్రధానంగా నేటి యువకులు విలాసాల ప్రతిభగా వాటిని సేవిస్తున్న తీరు అనారోగ్యానికి హేతువు అన్న సత్యాన్ని గుర్తించాలని పలువురు వక్తలు సూచించారు. మంగళవారం
జాతీయ పొగాకు నియంత్రణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి Dr. G. నారాయణస్వామి ఆధ్వర్యంలో కసాపురం సబ్ సెంటర్ నందు , CHOs, కు, అంగన్వాడీ టీచర్స్ ANMs , Ashas మరియు ప్రజలకు, COTPA Act-2003 సిగరెట్టు మరియు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా Dr. G. నారాయణస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సకాలంలో పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కానీ ప్రాణాంతకమైన పొగాకు ఉత్పత్తులను కాదన్నారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, పొగాకు వాటి ఉత్పత్తుల వాడకంకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ పొగాకు ఉత్పత్తుల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని, మనిషి యొక్క ఆయుష్యు తగ్గుతుందని, పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల పరిధిలో ఉన్న పలు దుకాణాలలో సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదన్న ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వలన ఎనిమిది లక్షల మంది మిలియన్ ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మంది చనిపోతున్నారని అందులో ఒక్క మిలియన్ ప్రజలు సిగరెట్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారన్నారు . సిగరెట్ వాడడంతో అందులో ఉన్న నాలుగు వేల రకాల రసాయనాలు మనిషి యొక్క అవయవాలపై ప్రభావం చూపించి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా నోరు, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలుమెండుగా ఉన్నాయన్నారు. ఈక్రమంలోనే బహిరంగ ధూమపానము చేసిన, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాల లోపు ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా రూ:200 కూడా విధించడం జరుగుతుంది. పొగాకు ఉత్పత్తులపై
ఎలాంటి ప్రచారం నిర్వహించ రాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగకు నియంత్రణ Social Worker /DCM, B. శ్రీరాములు, NCD ఫ్లోరోసిస్, కన్సల్టెంట్ ఆంజనేయలు, కిషోర్, CHO, Ashas, Anms, అంగన్వాడీ టీచర్స్, పాల్గొన్నారు.

నీ హక్కులు తెలుసుకో… నీ జీవితాన్ని మార్చుకో …! -సమస్య మీది.. పరిష్కారం మాది..!

0

నీ హక్కులు తెలుసుకో… నీ జీవితాన్ని మార్చుకో …! -సమస్య మీది.. పరిష్కారం మాది..!

ప్రభాత దర్శిని (తిరుపతి సిటీ ప్రతినిధి):

నిజ జీవితంలో మనిషి అతని హక్కులు తెలుసుకొని సమాజంలో స్వేచ్ఛగా బ్రతకడంతో పాటు తన జీవితాన్ని మార్చుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ చంద్రకళ రెడ్డి తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ , ఫౌండర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు స్థానిక రాయలచెరువు రోడ్డు ఎస్బిఐ కాలనీలో నీ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషి తన హక్కులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచే వారి హక్కులను బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా చిన్నారులు క్రమశిక్షణతో మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలతో పాటు పురుషులు కూడా వారి హక్కులు చట్టాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దీంతోపాటు వారు తెలుసుకున్న విషయాలను పదిమందికి తెలియజెప్పి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు సర్టిఫికెట్ను ప్రధానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు సభ్యులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భార్గవ సాయి నియామకం..

0

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భార్గవ సాయి నియామకం

బి వి ఆర్ టుడే న్యూస్ డిసెంబర్ 10 రాజమండ్రి : కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన భార్గవసాయికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా లో వస్తాను లభించింది.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మంగళవారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, నేషనల్ చైర్మన్ చెన్నూపాటి శ్రీకాంత్ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు గార్ల ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భార్గవ సాయి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు సభ్యులు భార్గవ్ సాయిని అభినందించారు. మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.