Thursday, April 24, 2025
spot_img
Home Blog Page 4

సిపిఐ (యం.యల్) లిబరేషన్ పార్టీ ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి..

0

సిపిఐ (యం.యల్) లిబరేషన్ పార్టీ ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి..

డిసెంబర్ 1 : అనంతపురం

అనంతపురం నందు పార్టీ కార్యాలయంలో డిసెంబర్ 4వ తేదీ విజయవాడలో జరుగు “ప్రజా హక్కుల సభ ” కు సంబంధించిన గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి టియస్ వలి మరియు జిల్లా నాయకులు సి పరుశురాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ మాత్రమే కాదు ప్రజల కోరే పీపుల్ సిక్స్ సాధిద్దామంటూ మరి తెలుగు నెల నుంచి తరిమివేదం అంటూ ఆదివారం సిపిఐ (యం.యల్) లిబరేషన్ పార్టీ విజయవాడలో జింఖానా గ్రౌండ్ నందు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మరియు ర్యాలీని చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునివ్వడం జరిగింది. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు గత వైసిపి నాయకులు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా జనాకర్షణ కోసం సూపర్ సిక్స్ పేరుతో కూటమి నాయకులు ఎన్నికలకు పోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రజలు కూటమి పార్టీలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 6 నెలలు కావస్తున్న ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కదో పట్టించే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సామ్రాజ్యానికి చత్రపతిగా వ్యవహరించే విధంగా రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టబోతున్నాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సమస్యలను పక్కనపెట్టి మతాలను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి నాయకులు వ్యవహరించడాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వీటన్నిటికీ సమాధానంగా డిసెంబర్ 4వ తేదీ విజయవాడలో జరుగు ప్రజా హక్కుల సభను విజయవంతం చేయాలని ఈ సభలో ముఖ్య అతిథులుగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దింపాకర్ భట్టాచార్య మరియు పార్టీ సెంట్రల్ కమిటీ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వేమన, జిల్లా నాయకులు సుజాత, బాలకృష్ణ, టి.యస్. మహబూబ్ బాషా, మరియు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…

0

కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు

డిసెంబర్ 1 : కర్నూల్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు నగరంలోని 1వ వార్డు లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ భాస్కర్, కర్నూలు ఐటిడిపి అధ్యక్షుడు మంద అఖిల్, బూత్ ఇంచార్జ్ లు, కిరణ్, ఆయత్ బీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

వజ్రకరూరు హెడ్ కానిస్టేబులకు పదోన్నతి….

0

వజ్రకరూరు హెడ్ కానిస్టేబులకు పదోన్నతి

డిసెంబర్ 01 :గుంతకల్లు

వజ్రకరూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జీ.రమేశు ఏఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పదోన్నతి పొందిన రమేశ్ను పోలీసు సిబ్బంది, ప్రస్తుత వజ్రకరూరు ఎస్ఐ అభినందనలు తెలిపారు. పదోన్నతి పొందిన రమేశ్ మాట్లాడుతూ.. పదోన్నతి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ఏపీలో టీచర్ల బదిలీల రూట్ మ్యాప్ ఇదే…

0

ఏపీలో టీచర్ల బదిలీల రూట్ మ్యాప్ ఇదే…
డిసెంబర్ 01: అమరావతి
ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు.ఫిబ్రవరి15, మార్చి 1,15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు.ఏప్రిల్ 10-15 వరకు హెడ్ మాస్టర్లు,21-25 వరకు సీనియర్ అసిస్టెంట్లు , మే 1-10 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు హెడ్ మాస్టర్లు, మే 26-30 వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్లు చేపడతారు.

తిరుపతి వాసుల”చిరకాల వాంఛ” నెరవేరింది… నవీన్ కుమార్ రెడ్డి

0

తిరుపతి వాసుల
“చిరకాల వాంఛ” నెరవేరింది… నవీన్ కుమార్ రెడ్డి నవంబర్ 30 తిరుపతి

టీటీడీ చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు గారి చేతుల మీదుగా స్థానికులకు మొదటి శ్రీవారి దర్శనం టోకెన్లను జారీ చేయాలని నవీన్ విజ్ఞప్తి…

తిరుపతి చంద్రగిరి రేణిగుంట రూరల్ వాసులకు “ఆధార్ కార్డు” ఆధారంగా శ్రీవారి దర్శన భాగ్యం దైవానుగ్రహం..

తుఫాను కారణంగా టోకెన్ల జారీ డిసెంబర్ 2 వ తేది సోమవారం నుంచి ప్రారంభం…

మాట తప్పని మడమ తిప్పని ఎన్డీఏ కూటమి నేతలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం…

బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి నగర ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన” భాగ్యాన్ని కల్పిస్తూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎన్డీఏ కూటమి అగ్ర నాయకుల ఆదేశాలతో మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటించడంతో టీటీడీ ఈవో శ్యామలరావు గారి ఆదేశాలతో అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి సూచనల మేరకు తిరుపతి జేఈవోలు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షణలో డిసెంబర్ 2 ( ఎల్లుండి) సోమవారం నుంచే దర్శన టోకెన్ల విడుదలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామం, అభినందనీయమన్నారు..

తిరుమల తిరుపతి స్థానికులతో పాటు తిరుపతి అర్బన్,రూరల్,చంద్రగిరి, రేణిగుంట మండలాలోని ప్రజలకు కూడా ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని నిర్ణయించడం దైవానుగ్రహం అన్నారు

తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు తిరుమల వాసులకు అలాగే మహతి ఆడిటోరియంలో తిరుపతి రేణిగుంట చంద్రగిరి అర్బన్ రూరల్ ప్రాంత ప్రజలకి టోకెన్ కౌంటర్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు..

శ్రీవారి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు సంయమనం పాటించాలని తోపులాటలు తొక్కిస్తాలాటలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టిటిడి అధికారులకు ప్రతి శ్రీవారి భక్తుడు సంపూర్ణ సహకారం అందించాలన్నారు!

టిటిడి టోకెన్ విడుదల కేంద్రాల వద్ద ఎటువంటి సిఫార్సులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతనిస్తూ టిటిడి విజిలెన్స్,స్థానిక పోలీస్ అధికారుల పర్యవేక్షణలో పటిష్టమైన క్యూలైన్ లను ఏర్పాటు చేయాలన్నారు…

శ్రీవారి దర్శన టోకెన్ల కోసం సెంటర్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని టిటిడి ఉన్నతాధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు!

నవీన్ కుమార్ రెడ్డి
బిజెపి నాయకులు

డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు..

0

డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు..

నవంబర్ 30, అమరావతి.

ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ.. సంక్రాంతి 2025 కానుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది.గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో.. కొత్తగా పెళ్లిళ్లు అయినవారు, రాజకీయాల కారణాలతో రేషన్ కార్డులు రానివారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, సభ్యుల తొలగింపు.. ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం 3,36,72000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త దరఖాస్తులతో పాటు వీటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డు్ల్ని అందించనుంది కూటమి ప్రభుత్వం.

ఎయిడ్స్ పే అవగాహన బాధిత మృతుల పట్ల శ్రద్ధాంజలి…

0

ఎయిడ్స్ పే అవగాహన బాధిత మృతుల పట్ల శ్రద్ధాంజలి…
నవంబర్ 30 గుంటకల్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ పై అవగాహన తో పాటు బాధిత మృతుల పట్ల ఆసుపత్రి వైద్య ఆరోగ్యశాఖ ప్రగతి ,మైత్రి మహిళా సంఘం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవనం ముందు ఎయిడ్స్ పట్ల రంగవల్లికల నమూనాలతో క్రొవోత్తుల నడుమ బాధిత మృతుల కు శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఏవో రాంప్రసాద్ రావు , డాక్టర్ ప్రజ్ఞ లుముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు…

0

సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు

నవంబర్ 30 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన సిఏం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందిరమ్మ కాలనీలో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కలియ దిరుగుతూ ప్రజలను పలకరించారు. అలాగే స్థానికులతో సమావేశమై అర్జీలను స్వీకరించారు.

శ్రీ నెట్టికoటు ని సేవలో విజయవాడ సిటీ డీసీపీ..

0

శ్రీ నెట్టికoటు ని సేవలో విజయవాడ సిటీ డీసీపీ..
నవంబర్ 30 గుంతకల్లు
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానంకు విజయవాడ సిటీ డిసిపి ఉదయరాణి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఆమె రాకతో ఆలయ అధికారులు పర్యవేక్షణలో అర్చక బృందం ఆలయ సంప్రదాయం సారం స్వాగతించారు. ఈ క్రమంలో శ్రీ స్వామివారి మూలవర్ల దర్శనం తో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు తదుపరి శ్రీవారి ప్రసాదంగా ఆమెకు తీర్థ ప్రసాదములను అందించారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు….

0

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు….

నవంబర్ 30 శ్రీకాళహస్తి

పవిత్ర మాసములలో ఒకటైన ఈశ్వరునకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రతీతి. కార్తీకమాసం శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలను దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో సాంప్రదాయ రీతిన జరిగాయి. సదరు పూజ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆలయ వేద పండితులు, అర్చక బృందం సంయుక్తంగా దేవాలయ ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశములు ఏర్పాటుతో విశేష పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు శ్రీవారికి ధూప,దీప నైవేద్యాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని కార్తీక మాసపు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమ బిల్వాలను కుంకుమను నిమజ్జల కార్యక్రమంను అత్యంత భక్తిశ్రద్ధల నడుమ సాంప్రదాయ పద్ధతిలో భక్తాదుల పట్ల నేత్రానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి
టి.బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కర్ణాకర్ గురుకుల్, ఏ.ఈ.ఓ లోకేష్ రెడ్డి,సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్, దేవస్థానం ఇన్స్పెక్టర్ హరి యాదవ్, మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.