ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా ప్రధమ స్థానంలో ఉండేందుకు అధికారులు కృషి చేయాలి..
నవంబర్ 20 గుత్తి.
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఐఏఎస్
రాష్ట్రంలో అనంతపురం జిల్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లో మొదటి స్థానంలో ఉండేందుకు అధికారులకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, ఐఏఎస్ పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారుల అవగాహన వారోత్సవాలలో భాగంగా బుధవారం గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలంలోని జక్కల చెరువు గ్రామంలో జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం మండలంలోని ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుందని కానీ దీనివల్ల గ్రామస్థాయిలోని ప్రజలకి దాని పట్ల అవగాహన ఉందా లేదా అని ఒక ప్రశ్నగా మారిందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకాన్ని చిట్టచివరి గ్రామానికి, లబ్ధిదారునికి అవగాహన కలుగుతుందో అప్పుడు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. వివిధ కార్యక్రమాలను జిల్లా కేంద్రంలోనే కాకుండా మారుమూల గ్రామాలలో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు .అలా నిర్వహించే గ్రామ సభలలో అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్లి కూర్చొని మాట్లాడి నేరుగా సమాచారాన్ని తెలియజేయడం వలన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఫలితాలను సాధించాలన్నారు.కేంద్ర ఆవాస్ దివాస్ యోజన పథకం ముఖ్య ఉద్దేశం పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని యోచనతో కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా జిల్లాలకు అందజేస్తుందని తెలిపారు. దీనిలో ఒక ఇంటికి ఒక లక్ష 20 వేల రూపాయలు ప్రభుత్వం నుండి అందుతుందని అన్నారు. ఇందులో కొంతమందికి ఇంటి స్థలము ఉండి పక్కా గృహాలు లేనివారికి రెవెన్యూ శాఖ వారి ద్వారా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఇల్లు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, ఇంకొకటి భూమిలేని వారికి ఇల్లు కావాలని అర్జీ దారుడు వస్తే అలాంటివారికి రెవెన్యూ శాఖ వారి ద్వారా భూమిని గుర్తించి లేఔట్లను తయారు చేసి ఇళ్లను కట్టించి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుండి 1.20 లక్షల రూపాయలు ఇస్తుందని దీనికి మీరు కొంత వేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చని అలా కూడా కాకుండా మొత్తం కూడా మీ వద్ద లేని పక్షంలో పొదుపు సంఘాల ద్వారా 30 వేల రూపాయలు పొదుపు సంఘాల లోని మహిళలకు అప్పుగా రొటేషన్ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఇలా లక్ష యాభై వేల లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవచ్చని అన్నారు. సమాజంలో ఒక ఇల్లు నిర్మించుకుంటే గౌరవం,ఆడపిల్లలకు భద్రత, ఆర్థిక భద్రత ఉంటుంది అన్నారు. ప్రభుత్వం ద్వారా నిర్మించే గృహ నిర్మాణాల సముదాయాల సంబంధించి మౌలిక వసతులు కల్పనకు ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు కాలువలు,ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మరింత ముందుకు తీసుకెళ్లే అవగాహన మరియు సద్వినియోగం కల్పించే దిశగా కృషి చేయాలని హౌసింగ్ పిడిని ఆదేశించారు. అనుమతులు ఇచ్చి ఇంకను పనులు ప్రారంభించని వారిని సంప్రదించి వారికి అవసరం ఉందో లేదో తెలుసుకుని మరొకరికి అవకాశం కల్పించే విధంగా చూసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కోరారు.ఈ పథకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లాలో ఏ నిరుపేద కూడా ఇల్లు కావాలని వచ్చేవారికి ఇల్లు కట్టించి లబ్ధి పొందే విధంగా చూడాలని ఆర్డీవో, హౌసింగ్, ఉపాధి హామీఅధికారులకు ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ పనులను త్వరితగతిన పూర్తి చేసి బిల్లులను లబ్ధిదారుల అంతే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జక్కల చెరువు గ్రామంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని ఇళ్లలో నివసిస్తున్న బొలికొండ, సురేష్ బాబు, వీరారెడ్డి ఇళ్లను పరిశీలించి వారితో ఇంతకుముందు ఇలాంటి ఇండ్లలో ఉండేవాడిని, ఏ విధంగా ఉండేవారని , ఇండ్ల నిర్మాణం గురించి ఎవరు తెలియజేశారని, ఇల్లు నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల నుండి వచ్చాయా,సిమెంటు, ఇసుక తదితర విషయాలను అడిగారు. గతంలో మట్టి ఇండ్లలో, గుడిసెలలో ఉండేవారమని ప్రభుత్వ గృహ నిర్మాణ అధికారులు ఈ పథకం గురించి తెలియజేశారని తద్వారా ఇల్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ శైలజ ,జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, తాసిల్దార్ ఓబులేసు, ఎంపీడీవో ప్రభాకర్ , హౌసింగ్ ఈ మధుసూదన్ రెడ్డి,హౌసింగ్ ఏఈ సూర్యనారాయణ,ఎంపీపీ విశాలాక్షి, ఎంపీటీసీ నారాయణస్వామి, ప్రజా ప్రతినిధులు నారాయణ,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.